MAA Elections: ‘మా’ అధ్యక్ష బరిలో ఇద్దరే

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల్లో పలువురు అభ్యర్థులు తమ నామినేషన్లని ఉపసంహరించుకున్నారు. అధ్యక్ష స్థానానికి పోటీ చేసిన సి.వి.ఎల్‌.నరసింహారావు, కె.శ్రావణ్‌కుమార్‌ పోటీ నుంచి తప్పుకొన్నారు.

Updated : 03 Oct 2021 07:16 IST

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల్లో పలువురు అభ్యర్థులు తమ నామినేషన్లని ఉపసంహరించుకున్నారు. అధ్యక్ష స్థానానికి పోటీ చేసిన సి.వి.ఎల్‌.నరసింహారావు, కె.శ్రావణ్‌కుమార్‌ పోటీ నుంచి తప్పుకొన్నారు. అలాగే కార్యవర్గ సభ్యుల్లోనూ ఇద్దరు పోటీ నుంచి విరమించుకున్నారు. ఇప్పటికే ప్రధాన కార్యదర్శి పదవి కోసం పోటీ చేసిన బండ్ల గణేశ్‌ తప్పుకొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అధ్యక్ష స్థానం కోసం ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు మాత్రమే పోటీ పడుతున్నారు. ఈ నెల 10న ఎన్నికలు జరగనున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని