Suriya: ఫ్యామిలీతో సూర్య హాలీడే ట్రిప్‌.. సెంట్రాఫ్‌ అట్రాక్షన్‌ ఆమెనే!

తన ఫ్యామిలీతో కలిసి ప్రముఖ హీరో సూర్య విహార యాత్రకు వెళ్లారు. సంబంధిత ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Published : 04 Jul 2023 01:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నటులుగా, నిర్మాతలుగా ఎంతో బిజీగా ఉండే సూర్య (Suriya), జ్యోతిక (Jyothika) ఆ పనులకు కాస్త బ్రేక్‌ ఇచ్చారు. తమ పిల్లలు దియా, దేవ్‌లతో కలిసి హాలీడే ట్రిప్‌ ఎంజాయ్‌ చేస్తున్నారు. వీరు ఫారో ఐలాండ్‌ తదితర ప్రాంతాలను చుట్టేస్తున్నారు. తమ ప్రయాణానికి సంబంధించిన వీడియోలు, అందమైన ప్రాంతాల్లో దిగిన ఫొటోలను జ్యోతిక సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. కొన్ని క్షణాల్లోనే సంబంధిత ఫొటోలు వైరల్‌గా మారాయి. వాటిల్లో దియా సెంట్రాఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. నెటిజన్లు ఆమె గురించే చర్చించుకుంటున్నారు. ‘దియా హీరోయిన్‌లా ఉంది’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

సూర్య ప్రస్తుతం ‘కంగువ’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని త్రీడీలో పదికిపైగా భాషల్లో దర్శకుడు శివ తెరకెక్కిస్తున్నారు. ఇందులో సూర్య ఐదు విభిన్న లుక్స్‌లో కనిపిస్తారని సమాచారం. మరోవైపు, ‘సూరారై పోట్రు’ హిందీ రీమేక్‌లో అతిథి పాత్ర పోషిస్తున్నారు. జ్యోతిక కొంతకాలంగా నాయికా ప్రాధాన్య చిత్రాలతో అలరిస్తున్న సంగతి తెలిసిందే. ‘పొన్‌మగళ్‌ వందాళ్‌’, ‘ఉడన్పిరప్పే’ (తెలుగులో రక్త సంబంధం) తదితర చిత్రాలతో ఆకట్టుకున్న ఆమె బాలీవుడ్‌లో రెండు సినిమాలు చేస్తున్నారు. ఈ దంపతులు 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థను స్థాపించి ‘సూరారై పోట్రు’ (ఆకాశం నీ హద్దురా), ‘జై భీమ్‌’వంటి సినిమాలు నిర్మించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని