Salaar: ‘కాటేరమ్మ సీన్‌’... విజిల్స్‌ పడతాయని ప్రభాస్‌ ముందే చెప్పారు: బాలనటి

‘సలార్‌’ (Salaar)లో హైలైట్‌గా నిలిచిన కాటేరమ్మ ఫైట్‌ సీక్వెన్స్‌లో తన నటనతో ఆకట్టుకుంది బాలనటి ఫర్జానా. ఈ సీక్వెన్స్‌ చిత్రీకరణ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడింది.

Published : 24 Dec 2023 17:51 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రభాస్‌ (Prabhas) - ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘సలార్‌’ (Salaar) ప్రస్తుతం బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తోంది. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకున్న ఈ సినిమాలోని ఎలివేషన్స్‌ గురించే సినీ ప్రియులు మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా ‘కాటేరమ్మ’ ఫైట్‌ సీక్వెన్స్‌ చిత్రానికే హైలైట్‌. ‘కాటేరమ్మ రాలేదు కానీ.. కొడుకుని పంపింది’ అంటూ దేవా (ప్రభాస్‌) పాత్రను ఉద్దేశించి సురభి (బాలనటి ఫర్జానా) చెప్పే డైలాగ్స్‌ విశేష ఆదరణ సొంతం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఫర్జానా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని.. కాటేరమ్మ సీక్వెన్స్‌ గురించి మాట్లాడింది. ఈ సీన్‌కు థియేటర్‌లో తప్పకుండా విజిల్స్‌ పడతాయని షూట్‌ సమయంలోనే ప్రభాస్‌ చెప్పారని ఫర్జానా తెలిపింది.

Animal Ott Release: ఓటీటీలోకి ‘యానిమల్‌’.. ఆ షాట్స్‌ యాడ్‌ చేస్తున్న దర్శకుడు

‘‘కొన్నేళ్ల నుంచి సినీ పరిశ్రమలో వర్క్‌ చేస్తున్నా. ‘ఐపీఎల్‌’, ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ యాడ్స్‌లో నటించా. ‘ఝాన్సీ’, ‘ఓరి దేవుడా’ చిత్రాల్లో బాలనటిగా కనిపించా. తెలిసిన వాళ్ల ద్వారా కొంతకాలం క్రితం ‘సలార్‌’ ఆడిషన్స్‌లో పాల్గొన్నా. చిత్రబృందం చాలా మంది పిల్లలను ఆడిషన్‌ చేసింది. చివరకు నన్ను ఎంపిక చేసింది. ప్రభాస్‌ నా అభిమాన నటుడు. సెట్‌లో ఆయన చాలా సరదాగా ఉంటారు. మొదటిరోజు ఆయనతో మాట్లాడినప్పుడు.. ‘‘చూడచక్కగా ఉన్నావు. బాగా చెయ్‌’’ అని ధైర్యం చెప్పారు. ప్రశాంత్‌ నీల్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ‘కాటేరమ్మ’ సీక్వెన్స్‌ షూట్‌ చేయడానికి ఒక రోజు ముందు రిహార్సల్స్‌ చేశాం. ఈ  సీన్‌కు థియేటర్‌లో విజిల్స్‌ పడతాయని చిత్రీకరణ సమయంలోనే ప్రభాస్‌ చెప్పారు’’ అని ఫర్జానా చెప్పింది. ‘సలార్‌ పార్ట్‌ 2 శౌర్యాంగ పర్వం’ కోసం తాను కూడా ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. ‘సలార్‌ సీజ్‌ఫైర్‌’ చూసిన తర్వాత ప్రేక్షకులకు కలిగిన సందేహాలన్నింటికీ ‘శౌర్యాంగ పర్వం’లో సమాధానాలు దొరుకుతాయని చెప్పింది. మరోవైపు, ‘సలార్‌ పార్ట్‌ 1’తో పోలిస్తే ‘పార్ట్‌ 2’ అదిరిపోతుందని ప్రభాస్‌ ఇటీవల చెప్పిన విషయం తెలిసిందే.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు