Adipurush: ‘ఆదిపురుష్’ ట్రైలర్ ఆరోజే!
‘ఆదిపురుష్’ (Adipurush)గా ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమవుతున్నారు కథానాయకుడు ప్రభాస్ (Prabhas). ఆయన టైటిల్ పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని ఓం రౌత్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే.
‘ఆదిపురుష్’ (Adipurush)గా ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమవుతున్నారు కథానాయకుడు ప్రభాస్ (Prabhas). ఆయన టైటిల్ పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని ఓం రౌత్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా జూన్ 16న విడుదల కానున్న నేపథ్యంలో ప్రచార పర్వాన్ని వేగవంతం చేసింది చిత్ర బృందం. ఇందులో భాగంగా ఈనెల 9న ట్రైలర్ విడుదల చేయనున్నారని సమాచారం. అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో ఓరోజు ముందుగానే అభిమానుల కోసం త్రీడీ ట్రైలర్ ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. తాజాగా ఈ ట్రైలర్ వీక్షించిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చిత్ర బృందాన్ని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. ‘‘ఆదిపురుష్’ ట్రైలర్ చూడటం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా ప్రేక్షకుల్ని కచ్చితంగా ఆకట్టుకుంటుంది. శ్రీరాముడి పాత్ర ప్రజలపై బలమైన ప్రభావం చూపుతుంది. ఇందులోని పాత్రలకు నటీనటులంతా జీవం పోశార’’ని ట్వీట్‌లో పేర్కొన్నారు. రామయాణం ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో రాముడి పాత్రను ప్రభాస్ పోషించగా.. సీతగా కృతి సనన్ నటించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ తేదీలు వచ్చేశాయ్
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Asian Games: షూటింగ్లో మరో గోల్డ్.. వుషూలో రజతం
-
మా స్నేహం మీద ఒట్టు.. చంద్రబాబు ఎలాంటి తప్పూ చేయరు: బాబు బాల్య స్నేహితులు
-
Vijayawada: సీఎం సభకు మీరు రాకుంటే.. మా ఉద్యోగాలు పోతాయ్
-
Rohit Sharma: సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధం.. వరల్డ్కప్ జట్టుపై నో డౌట్స్: రోహిత్