Adipurush: ‘ఆదిపురుష్‌’ టికెట్‌ ఆఫర్‌.. 3డీలో.. ఇప్పుడు ఎంతంటే?

రామాయణం ఆధారంగా దర్శకుడు ఓంరౌత్‌ తెరకెక్కించిన చిత్రం.. ‘ఆదిపురుష్‌’. ప్రభాస్‌, కృతిసనన్‌, సైఫ్‌ అలీఖాన్‌ ప్రధాన పాత్రధారులు. ఈ సినిమా టికెట్ల ధరను చిత్ర బృందం తగ్గించింది.

Published : 25 Jun 2023 22:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఆదిపురుష్‌’ (Adipurush) చిత్ర బృందం సినీ ప్రియులకు మరో శుభవార్త వినిపించింది. 3డీ వెర్షన్‌కు సంబంధించిన ఈ సినిమా టికెట్లను రూ. 112 (*షరతులు వర్తిస్తాయి) ప్రారంభ ధరతో విక్రయించనున్నట్టు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ ఆఫర్‌ సోమవారం నుంచి అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కేరళ, తమిళనాడు మినహా ఇతర రాష్ట్రాల్లో రూ. 150 ప్రారంభ ధరతో టికెట్ల (3డీ)ను ఈ నెల 22, 23న విక్రయించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు రూ. 112 ఆఫర్‌ వర్తిస్తుందని టీమ్‌ తెలియజేసింది. రామాయణ ఇతిహాసాన్ని 3డీలో అత్యధిక మంది చూడాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. ఎడిటెడ్‌ వెర్షన్‌తో సినిమా ప్రదర్శితమవుతుందని గుర్తుచేసింది.

రామాయణం ఆధారంగా దర్శకుడు ఓం రౌత్‌ (Om Raut) తెరకెక్కించిన ఈ సినిమా ఈ నెల 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఓ వైపు ఈ సినిమాకి చక్కటి ఆదరణ దక్కగా మరోవైపు విడుదలైన నాటి నుంచే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ సినిమాలోని పలు సంభాషణలు, నటీనటుల వేషధారణను పలువురు తప్పుబట్టారు. ఈ క్రమంలోనే.. అభ్యంతరం వ్యక్తమైన సీన్స్‌/డైలాగ్స్‌ను చిత్ర బృందం మార్చేసింది. మిశ్రమ స్పందనతోనూ ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. రాఘవుడిగా ప్రముఖ హీరో ప్రభాస్‌ (Prabhas) నటించిన ఈ సినిమాలో కృతి సనన్‌ (Kriti Sanon).. జానకిగా ఒదిగిపోయారు. సైఫ్‌ అలీఖాన్‌ (Saif Alikhan).. లంకేశ్‌గా ఆకట్టుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు