Ileana: నన్ను అంటే పడ్డా.. కానీ, అతడిని విమర్శిస్తే నేను తట్టుకోలేను: ఇలియానా

తన భాగస్వామి మైఖేల్‌ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు నటి ఇలియానా (Ileana). అతడు తనని ఎంతో గౌరవమిస్తాడన్నారు.

Published : 17 Mar 2024 18:35 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తన ప్రియుడు, భాగస్వామి మైఖేల్‌ గురించి పలు విషయాలు పంచుకున్నారు నటి ఇలియానా (Ileana). తన ఇష్టాయిష్టాలకు అతడు గౌరవమిస్తాడన్నారు. కోవా ఫీనిక్స్ డోలన్‌ (తనయుడిని ఉద్దేశించి) రాకతో తమ జీవితాలు అందం మారాయన్నారు. గతేడాది ఎంతో ఆనందంగా గడిచిందని.. జీవితంలో అది ప్రత్యేకమైన సంవత్సరమన్నారు.

‘‘ప్రెగ్నెంట్‌ అయ్యాక వర్క్‌ చేయాలనుకున్నా. పరిస్థితులు సహకరించకపోవడంతో ఆ నిర్ణయాన్ని విరమించుకున్నా. అప్పుడు అమ్మ అండగా నిలిచింది. ప్రసవానంతరం ఒత్తిడికి లోనయ్యా. నా భాగస్వామి మైఖేల్‌ సపోర్ట్‌ చేశాడు. మా బంధం గురించి పబ్లిక్‌గా చెప్పాలని లేదు. అలా చెప్పి గతంలో నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొన్నా. నా గురించి  ఏం మాట్లాడినా తట్టుకోగలిగా. వారి మాటలు పెద్దగా పట్టించుకోలేదు. కానీ, నా భాగస్వామి, కుటుంబం గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే తట్టుకోలేను’’ అని ఆమె చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని