Sara Ali Khan: శుభ్‌మన్ గిల్‌తో డేటింగ్ వార్తలపై స్పందించిన సారా అలీఖాన్
క్రికెటర్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill)తో డేటింగ్ వార్తలపై నటి సారా అలీఖాన్ (Sara Ali Khan) స్పందించారు.
ముంబయి: భారత యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill)తో బాలీవుడ్ నటి సారా అలీఖాన్ (Sara Ali Khan) డేటింగ్‌లో ఉందంటూ ఎంతోకాలం నుంచి వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై ఆమె స్పందించారు. క్రికెటర్‌ను పెళ్లి చేసుకోవడంలో తనకెలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. అయితే, ఒక కండిషన్ మాత్రం పెట్టారు.
విక్కీ కౌశల్‌తో తాను నటించిన సరికొత్త చిత్రం ‘జర హట్ కే జర బచ్ కే’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా సారా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా కాబోయే భర్త ఎలా ఉండాలనుకుంటున్నారంటూ విలేకరి ఆమెను అడిగారు. ‘(వివాహాన్ని ఉద్దేశిస్తూ) వ్యక్తిగత జీవితంలో మీ నాన్నమ్మ షర్మిలా ఠాకూర్ (ఆమె క్రికెటర్ మన్సూర్‌ను వివాహం చేసుకున్నారు)ను అనుసరిస్తారా?’ అంటూ సారాని విలేకరి ప్రశ్నించారు. దీనిపై స్పందించిన నటి ‘‘నా మానసిక, ఆధ్యాత్మిక విలువలకు సరితూగే వ్యక్తి దొరికినప్పుడు తప్పకుండా అతడితో జీవితాన్ని మొదలుపెడతాను. అతడు ఏ రంగానికి చెందిన వాడనేది పెద్దగా పట్టించుకోను. క్రికెటర్, నటుడు, వ్యాపారవేత్త.. ఇలా రంగం ఏదైనా పర్వాలేదు. నా విలువలను గౌరవిస్తే చాలు’’ అని బదులిచ్చారు.
అనంతరం ఆమె.. తాను ఓ క్రికెటర్‌తో డేటింగ్‌లో ఉన్నానంటూ వస్తోన్న వార్తలపై స్పందించారు. ‘‘నా జీవిత భాగస్వామిని నేనింకా కలవలేదు. కలిశానని కూడా అనుకోవడం లేదు. ఇది మాత్రం పూర్తి భరోసాతో చెబుతున్నా’’ అని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.