Amitabh Bachchan: ఆస్పత్రిలో చేరిన అమితాబ్‌ బచ్చన్‌..!

అగ్ర కథానాయకుడు అమితాబ్‌ బచ్చన్‌ అస్వస్థతకు గురైనట్లు వార్తలు వెలువడుతున్నాయి.

Published : 15 Mar 2024 14:10 IST

ముంబయి: బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan) అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు శుక్రవారం ఉదయం ముంబయిలోని కోకిలాబెన్‌ ఆస్పత్రిలో ఆయన చేరినట్లు సమాచారం. బిగ్‌బీ ఆస్పత్రిలో చేరడానికి గల కారణాలు తెలియరాలేదు. మరోవైపు, తాజాగా ఆయన ఎక్స్‌(ట్విటర్‌)లో పోస్ట్‌ పెట్టారు. ‘ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటా’ అని రాసుకొచ్చారు. తన అనారోగ్యాన్ని ఉద్దేశించే ఆయన ఈ పోస్ట్‌ పెట్టినట్లు నెటిజన్లు భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని