Ananya Nagalla: అలాంటి ఫొటోలు షేర్‌ చేయడానికి కారణమదే: అనన్య నాగళ్ల

ఇన్‌స్టాలో గ్లామరస్‌ ఫొటోలు షేర్‌ చేయడానికి గల కారణాన్ని తెలియజేశారు నటి అనన్య నాగళ్ల. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఈ విషయంపై మాట్లాడారు.

Published : 06 Nov 2023 14:01 IST

హైదరాబాద్‌: ‘మల్లేశం’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తెలుగమ్మాయి అనన్య నాగళ్ల (Ananya Nagalla). హీరోయిన్‌గానే కాకుండా సహాయనటిగానూ ప్రేక్షకులను అలరిస్తోన్న ఆమె నటించిన తాజా చిత్రం ‘అన్వేషి’. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇన్‌స్టా వేదికగా తరచూ గ్లామరస్‌ ఫొటోలు షేర్‌ చేయడానికి గల కారణాన్ని తెలియజేశారు.

దీపావళి వేడుకలు షురూ... ఒకేచోట కలిసిన స్టార్స్‌

‘‘వకీల్‌సాబ్‌’కు ముందు సోషల్‌మీడియాలో ఎక్కువగా ట్రెడిషనల్‌ లుక్‌ ఫొటోలు షేర్‌ చేసేదాన్ని. ఆ సినిమా తర్వాత ‘శాకుంతలం’ చేస్తోన్న రోజుల్లో గ్లామరస్‌ ఫొటోలు కొన్నింటిని అభిమానులతో పంచుకున్నా. ఆ ఫొటోలు షేర్‌ చేయడానికి అప్పట్లో ప్రత్యేక కారణం అంటూ ఏమీ లేదు. కాకపోతే ఆ ఫొటోలకు రెస్పాన్స్‌ బాగా వచ్చింది. అలాగే, సినిమా అనే రేస్‌లో నేను ఉండాలనుకుంటున్నా. ఇక్కడ నువ్వు ఉండాలంటే అన్ని రకాలుగా కనిపించాలి. ఆ విధంగా నేను గ్లామరస్ ఫొటోలు షేర్‌ చేస్తున్నా. కమర్షియల్ సినిమా అవకాశాలు వచ్చాయి. కాకపోతే వర్కౌట్‌ కాలేదు’’ అని ఆమె చెప్పారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం ‘అన్వేషి’. వి.జె.ఖన్నా దర్శకుడు. నవంబర్‌ 17న ఇది విడుదల కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని