Suma: 30మందిని దత్తత తీసుకున్న సుమ.. ప్రశంసలు కురిపిస్తోన్న నెటిజన్లు

యాంకరింగ్‌లో తన సత్తా చాటుతూనే సినిమాల్లోనూ కనిపిస్తుంటుంది సుమ(Suma). తాజాగా ఆమె చేసిన పనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Published : 01 Feb 2023 17:33 IST

హైదరాబాద్‌: యాంకర్‌ సుమ(Suma)ను ప్రేక్షకులు బుల్లితెర రాణిగా పిలుచుకుంటారు. తెలుగులో గలగలా మాట్లాడుతూ.. సమయానికి తగ్గట్లు పంచ్‌లు వేస్తూ అందరినీ నవ్విస్తుంటుంది సుమ. సినిమాల ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లు, టాక్‌ షోలతో ప్రతి రోజూ ఎంటర్‌టైన్‌ చేస్తుంటుంది. బుల్లితెరకే పరిమితం కాకుండా అప్పుడప్పుడూ వెండితెరపై కూడా మెరిసి అలరిస్తుంటుంది. ఇటీవల ‘జయమ్మ పంచాయితీ’(Jayamma Panchayathi) సినిమాతో పలకరించింది సుమ. తాజాగా సుమ చేసిన పనికి అందరూ ఫిదా అవుతున్నారు. ‘గొప్ప మనసు చాటుకున్నావని’ ప్రశంసిస్తున్నారు. 30 మంది విద్యార్థులను దత్తత తీసుకున్నట్లు ప్రకటించిన సుమ.. వాళ్ల పూర్తి బాధ్యతలను తానే చూసుకుంటున్నట్లు తెలిపింది.

ఇటీవల చెన్నై కాలేజీలో జరిగిన కార్యక్రమానికి సుమ అతిథిగా హాజరైంది. అందులో మాట్లాడుతూ..‘‘నేను టీచర్‌ అవుదామనుకున్నాను. కానీ యాంకర్‌ అయ్యాను. ఈరోజు ఈ వృత్తిలో కొనసాగుతున్నానంటే దానికి కారణం మా అమ్మ. ఆమె తెలుగు నేర్చుకొని నాకు నేర్పించింది. ఇందులో కొనసాగడానికి కూడా ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాను’’ అని చెప్పింది. తానూ సమాజానికి తనవంతూ సేవ చేస్తానని పేర్కొంది. ‘‘సమాజానికి సేవ చేయడం కోసం ‘ఫెస్టివల్ ఫర్‌ జాయ్‌’ (Festival For Joy)అనే సంస్థను ప్రారంభించాము. 30 మంది విద్యార్థులను దత్తత తీసుకున్నాం. వాళ్ల పూర్తి బాధ్యతలను మేమే చూస్తున్నాం. వాళ్లు జీవితంలో స్థిరపడే వరకు మేము సహాయం చేస్తుంటాం’’ అని చెప్పింది. ఈ విషయం తెలిసిన నెటిజన్లు సుమపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని