Aswani Dutt: పరిశ్రమని తప్పుదోవ పట్టిస్తున్నారు: నిర్మాత అశ్వినీదత్‌

సంక్రాంతికి విడుదలయ్యే అనువాద చిత్రాలకి థియేటర్ల కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వకూడదన్న ప్రకటనని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు ప్రముఖ నిర్మాత సి.అశ్వినీదత్‌.

Published : 22 Nov 2022 11:02 IST

సంక్రాంతికి విడుదలయ్యే అనువాద చిత్రాలకి థియేటర్ల కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వకూడదన్న ప్రకటనని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు ప్రముఖ నిర్మాత సి.అశ్వినీదత్‌ (Aswani Dutt). ఇలాంటి ప్రకటనలు పరిశ్రమని తప్పుదోవ పట్టించడంతోపాటు... పొరుగు పరిశ్రమలతో ఉన్న అనుబంధాల్ని, మన మార్కెట్‌ని దెబ్బతినేలా చేస్తాయన్నారు.

అశ్వినీదత్‌  (Aswani Dutt) ‘ఈనాడు సినిమా’తో మాట్లాడుతూ ‘‘మన సినిమాలు మన దగ్గర ఎలా ప్రదర్శితం అవుతున్నప్పటికీ... చాలా వరకు అనువాద మార్కెట్‌, ఓటీటీ మార్కెట్‌ పుణ్యమా అని గట్టెక్కుతున్నాయి. తమిళంలో మన సినిమాలు మంచి వసూళ్లని సాధిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అనువాద చిత్రాలకి మనం ప్రాధాన్యం ఇవ్వకూడదని ఎలా చెబుతారు? ఇది ఆత్మహత్యా సదృశ్యమే. ఒక తెలుగు నిర్మాత, తెలుగు దర్శకుడితో సినిమా చేశారు. దాన్ని సంక్రాంతికి విడుదల చేసుకుంటే తప్పేముంది? మరో నిర్మాత మాత్రం ఒకేసారి తన రెండు సినిమాలు విడుదల చేసుకోవచ్చా? థియేటర్ల సమస్యే ఉత్పన్నమవుతుందంటే... నా సినిమాపై మరో సినిమా ఎందుకని నిర్మాతకి చెప్పుకోవచ్చు కదా. నిర్మాతల మండలి ప్రకటనను ఖండిస్తున్నా’’ అన్నారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు