Bandla Ganesh: పవన్‌కల్యాణ్‌కు బండ్ల గణేశ్ విన్నపం.. ట్వీట్ చేసిన నిర్మాత
హైదరాబాద్: పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌కు(Pawan Kalyan) నిర్మాత బండ్ల గణేశ్ (Bandla Ganesh) చిన్న విన్నపం చేశారు. టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసే చిత్రాలతో పవన్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రావాలని కోరారు. పవన్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకుంటూ ‘గబ్బర్‌సింగ్’ లొకేషన్‌లో దిగిన కొన్ని ఫొటోలను శనివారం గణేశ్ షేర్ చేశారు. ‘‘నా దైవ సమానులైన పవన్‌కల్యాణ్.. తెలుగు చలనచిత్ర చరిత్రలో రికార్డులు తిరగరాసే సినిమాలు త్వరగా తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మిమ్మల్ని ప్రేమిస్తూ.. మీ ప్రేమను పొందుతూ సినిమా తీస్తే బాక్స్ బద్దలే’’ అని ఆయన రాసుకొచ్చారు.
ప్రస్తుతం ఈ ట్వీట్స్‌పై పవన్ ఫ్యాన్స్ స్పందిస్తున్నారు. ‘‘పవన్‌తో మీరు మళ్లీ సినిమా చేస్తున్నారా?’’ అని ప్రశ్నిస్తూ వరుస కామెంట్స్ చేస్తున్నారు. పవన్‌కల్యాణ్ నటించిన ‘తీన్‌మార్’, ‘గబ్బర్‌సింగ్’ చిత్రాలకు గణేశ్ నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. పవన్-బండ్లన్న కాంబోలో వచ్చిన ‘గబ్బర్‌సింగ్’ సూపర్‌హిట్ అందుకుంది. ప్రస్తుతం పవన్ చేతిలో ‘హరిహర వీరమల్లు’, ‘భవదీయుడు భగత్‌సింగ్’తోపాటు తమిళ చిత్రం ‘వినోదాయ సీతాం’ రీమేక్ ఉన్నాయి. రాజకీయాలతో బిజీగా ఉండటంతో వృత్తిపరమైన జీవితం నుంచి పవన్ చిన్న విరామం తీసుకున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Rishi Sunak: ఆయన నా ఫోన్ కాల్స్‌కు స్పందించడం లేదు: రిషి సునాక్
-
India News
Himanta Biswa Sarma: ఆమిర్ ఖాన్.. మీరు మా రాష్ట్రానికి ఆగస్టు 15 తర్వాతే రండి..!
-
Sports News
Best catches: విండీస్ ఆటగాళ్ల మెరుపు ఫీల్డింగ్.. ఒకే మ్యాచ్‌లో మూడు సంచలన క్యాచ్‌లు!
-
General News
Offbeat: ఆ విమానంలో జర్నీ కేవలం ఒక్క నిమిషమే.. ధరెంతో తెలుసా..?
-
Politics News
Tejashwi Yadav: నీతీశ్ నిర్ణయం ‘భాజపాకు చెంపపెట్టు’
-
World News
Mental fatigue: మానసిక అలసటకు తీవ్ర ఆలోచనలే కారణమా!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Offbeat: ఆ విమానంలో జర్నీ కేవలం ఒక్క నిమిషమే.. ధరెంతో తెలుసా..?
- Salman Rushdie: ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీపై దాడి.. స్టేజిపైనే కత్తిపోట్లు!
- Aadhi Pinisetty: ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీల పెళ్లి సందడి.. టీజర్ చూశారా!
- Rishi Sunak: ఆయన నా ఫోన్ కాల్స్‌కు స్పందించడం లేదు: రిషి సునాక్
- Munugode: మునుగోడు కాల్పుల కేసు.. వివాహేతర సంబంధమే కారణం: ఎస్పీ
- Fahadh Faasil MALIK Review: రివ్యూ: మాలిక్
- Ranveer singh: న్యూడ్ ఫొటోషూట్.. రణ్‌వీర్‌సింగ్ ఇంటికి పోలీసులు!
- Tejashwi Yadav: నీతీశ్ నిర్ణయం ‘భాజపాకు చెంపపెట్టు’
- Himanta Biswa Sarma: ఆమిర్ ఖాన్.. మీరు మా రాష్ట్రానికి ఆగస్టు 15 తర్వాతే రండి..!
- The Great Khali: అభిమానుల చర్యకు ఏడ్చేసిన ‘ది గ్రేట్ ఖలీ’