Tollywood: మీ ఆదరణ.. సంతోషాన్నిచ్చింది

సాత్విక్‌ వర్మ, నేహా పటాన్‌ జంటగా నటించిన చిత్రం ‘బ్యాచ్‌’. శివ దర్శకుడు. రమేష్‌ గనమజ్జి నిర్మించారు. రఘు కుంచే స్వరాలందించారు. ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే

Updated : 20 Feb 2022 08:52 IST

సాత్విక్‌ వర్మ, నేహా పటాన్‌ జంటగా నటించిన చిత్రం ‘బ్యాచ్‌’. శివ దర్శకుడు. రమేష్‌ గనమజ్జి నిర్మించారు. రఘు కుంచే స్వరాలందించారు. ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్‌లో థ్యాంక్స్‌ మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో సాత్విక్‌ మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి మంచి చిత్రంలో నటించే అవకాశమిచ్చినందుకు దర్శక నిర్మాతలకు థ్యాంక్స్‌. సీనియర్‌ ఆర్టిస్ట్‌లందరూ నాకెంతో సహకరించారు’’ అన్నారు. ‘‘నటీనటులు, సాంకేతిక నిపుణుల సహకారం వల్లే సినిమా ఇంత బాగా వచ్చింది. ప్రేక్షకుల ఆదరణ వల్ల ఈరోజు మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఇంత మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు దర్శకుడు. నిర్మాత మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రం కోసం నాకెంతో మంది అండగా నిలిచారు. దర్శకుడు శివ చాలా కష్టపడ్డాడు. రఘు మంచి స్వరాలిచ్చారు. ఈ చిత్రాన్ని విజయవంతం చేసిన సినీప్రియులకు ధన్యవాదాలు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో రఘు కుంచే, డి.యస్‌.రావ్‌, నేహా తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని