Beast: ‘బీస్ట్‌’ ట్రైలర్‌ ఆరోజే

విజయ్‌ కథానాయకుడిగా నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ తెర కెక్కించిన యాక్షన్‌  ఎంటర్‌టైనర్‌ ‘బీస్ట్‌’. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించింది. పూజా హెగ్డే కథానాయిక. ఈ సినిమా ఏప్రిల్‌ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచార కార్యక్రమాల్ని

Updated : 31 Mar 2022 14:01 IST

విజయ్‌ కథానాయకుడిగా నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ తెర కెక్కించిన యాక్షన్‌  ఎంటర్‌టైనర్‌ ‘బీస్ట్‌’. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించింది. పూజా హెగ్డే కథానాయిక. ఈ సినిమా ఏప్రిల్‌ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచార కార్యక్రమాల్ని వేగవంతం చేస్తోంది చిత్ర బృందం. ఇందులో భాగంగా ఏప్రిల్‌ 2న సాయంత్రం 6గంటలకు ట్రైలర్‌ విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని బుధవారం అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల వేదికగా ఓ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమా తమిళం, తెలుగుతో పాటు పలు భాషల్లో విడుదల కానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని