BRO OTT Release Date: ఓటీటీలోకి ‘బ్రో’ సినిమా.. రిలీజ్‌ ఎక్కడంటే..?

పవన్‌కల్యాణ్‌ దేవుడి పాత్రలో నటించిన చిత్రం ‘బ్రో’ (BRO). త్వరలో ఈ సినిమా ఓటీటీలో విడుదల కానుంది.

Updated : 20 Aug 2023 11:35 IST

హైదరాబాద్‌: పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan)- సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) మల్టీస్టారర్‌గా తెరకెక్కిన చిత్రం ‘బ్రో’ (Bro). సముద్రఖని దర్శకుడు. ‘వినోదాయసిత్తం’కు రీమేక్‌గా.. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సిద్ధమైన ఈ చిత్రం గత నెలలో విడుదలైంది. ఇప్పుడీ చిత్రం ఓటీటీ విడుదలకు రంగం సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా వచ్చే శుక్రవారం (ఆగస్టు 25) నుంచి ఇది అందుబాటులో ఉండనుంది. దీనిపై సినీ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Varun Tej: ‘గని’ ఫ్లాప్‌.. అదే మేము చేసిన పెద్ద తప్పు: వరుణ్‌ తేజ్‌

కథేంటంటే: ఇంటికి పెద్ద కొడుకైన మార్క్ అలియాస్ మార్కండేయులు (సాయిధ‌ర‌మ్ తేజ్) తండ్రి మ‌ర‌ణం త‌ర్వాత అన్ని బాధ్య‌త‌లను త‌న భుజాన మోస్తుంటాడు. ఇద్ద‌రు చెల్లెళ్లు, త‌మ్ముడు స్థిర‌ప‌డాల‌ని... ఉద్యోగంలో త‌ను మ‌రింత ఎత్తుకు ఎద‌గాల‌ని నిరంతరం శ్ర‌మిస్తుంటాడు. ఓ రోజు ఊహించ‌ని రీతిలో ఓ రోడ్డు ప్ర‌మాదం కాల‌నాగులా ఆయ‌న్ని క‌బ‌ళిస్తుంది. త‌న‌వాళ్లెవ‌రూ జీవితంలో స్థిర‌ప‌డ‌లేద‌ని, తాను చేయాల్సిన ఎన్నో ప‌నులు మిగిలిపోయాయ‌ని.. త‌న జీవితానికి ఇంత తొంద‌ర‌గా ముగింపునివ్వ‌డం అన్యాయమని కాలం (ప‌వ‌న్‌క‌ల్యాణ్‌) అనే దేవుడి ముందు మొర‌పెట్టుకుంటాడు. (BRO OTT Release Date) దాంతో కాలం అనుగ్ర‌హించి 90 రోజులు అత‌డి జీవిత‌కాలాన్ని పెంచుతాడు. అలా మ‌ళ్లీ ఇంటికి చేరిన మార్క్ 90 రోజుల్లో అనుకున్న‌వ‌న్నీ చేశాడా? అత‌డివ‌ల్లే ప‌నుల‌న్నీ అయ్యాయా? అనే ఆసక్తికర అంశాలతో ఈసినిమా సిద్ధమైంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని