శోభన్‌ బాబు నటించనన్న పాత్రలివే

ఎన్నో వైవిధ్య చిత్రాల్లో నటించిన దివంగత నటుడు శోభన్‌ బాబు ఒకానొక సమయంలో తన దగ్గరికి వచ్చిన కథల్ని తిరస్కరించిన విషయం తెలిసిందే. ‘ప్రేక్షకులు నన్ను హీరోగానే తమ గుండెల్లో పెట్టుకున్నారు.

Published : 27 Apr 2021 09:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎన్నో వైవిధ్య చిత్రాల్లో నటించిన దివంగత నటుడు శోభన్‌ బాబు ఒకానొక సమయంలో తన దగ్గరికి వచ్చిన కథల్ని తిరస్కరించిన విషయం తెలిసిందే. ‘ప్రేక్షకులు నన్ను హీరోగానే తమ గుండెల్లో పెట్టుకున్నారు. నా కెరీర్‌ హీరోగానే ముగిసిపోవాలి తప్ప మరో విధంగా కాదు’ అంటూ సహాయ, కీలక పాత్రల్లో నటించేందుకు అనాసక్తి కనబరిచారాయన. ఆ సినిమాలు, ఆయన వద్దన్న పాత్రలివీ...

* నాగార్జున ప్రధాన పాత్రలో రాఘవేంద్రరావు తెరకెక్కించిన చిత్రం ‘అన్నమయ్య’. ఇందులో శ్రీ వేంకటేశ్వరస్వామి పాత్రను పోషించమని చిత్ర బృందం కోరగా సున్నితంగా తిరస్కరించారు శోభన్‌ బాబు. దాంతో ఆ పాత్రకి సుమన్‌కి ఎంపిక చేశారు.

* మహేశ్‌ బాబు- త్రివిక్రమ్‌ కలయికలో వచ్చిన చిత్రం ‘అతడు’. ఈ సినిమాలోని సత్యనారాయణ మూర్తి (నాజర్‌) పాత్ర ముందుగా శోభన్‌ బాబు దగ్గరకే వెళ్లింది. నటుడు, నిర్మాత మురళీ మోహన్‌ ఈ పాత్ర చేయమని బ్లాంక్‌ చెక్కు ఇచ్చినా శోభన్‌ బాబు నో చెప్పారు.

* పవన్‌ కల్యాణ్‌ హీరోగా భీమినేని శ్రీనివాసరావు తెరకెక్కించిన ‘సుస్వాగతం’ సినిమాలో రఘువరన్‌ పోషించిన పాత్ర శోభన్‌ బాబు దగ్గరికి వెళ్లిందే.

* హిందీలో అమితాబ్‌ బచ్చన్‌ ప్రధాన పాత్ర పోషించిన ‘బ్లాక్‌’ చిత్రాన్ని తెలుగులో శోభన్‌ బాబుతో రీమేక్‌ చేయాలనుకున్నారు నిర్మాత ఆర్.బి.చౌదరి. దానికీ నో చెప్పారు శోభన్‌ బాబు.

చేయాలనుకున్న చిత్రం పట్టాలెక్కలేదు..

అలా పలు క్రేజీ ప్రాజెక్టుల్ని తిరస్కరించిన శోభన్‌ బాబు ఎట్టకేలకు ఓ చిత్రంలో నటించేందుకు పచ్చజెండా ఊపారు. కానీ, అది కార్యరూపం దాల్చలేదు. అదేదంటే.. కోడి రామకృష్ణ దర్శకుడిగా నిర్మాత వి.బి. రాజేంద్ర ప్రసాద్‌ రూపొందించాలనుకున్న మల్టీస్టారర్‌. కృష్ణ, శోభన్‌ బాబు, జగపతి బాబు.. ఇదీ తారాగణం.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts