Vikrant Rona: జులైలో ‘విక్రాంత్‌ రోణ’

కిచ్చా సుదీప్‌ హీరోగా నటించిన త్రీడీ సినిమా ‘విక్రాంత్‌ రోణ’. అనుప్‌ భండారి దర్శకుడు. జాక్‌ మంజునాథ్‌, శాలిని మంజునాథ్‌ సంయుక్తంగా నిర్మించారు.

Updated : 03 Apr 2022 08:00 IST

కిచ్చా సుదీప్‌ హీరోగా నటించిన త్రీడీ సినిమా ‘విక్రాంత్‌ రోణ’. అనుప్‌ భండారి దర్శకుడు. జాక్‌ మంజునాథ్‌, శాలిని మంజునాథ్‌ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా జులై 28న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే శనివారం ఈ చిత్ర ట్రైలర్‌ను హీరో చిరంజీవి విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ..‘‘ప్రపంచంలోని కొత్త హీరో విక్రాంత్‌ రోణను ప్రేక్షకులకు వారి ప్రాధాన్య భాషల్లో అందించడానికి మేము ప్రయత్నిస్తాం. ఇదొక విజువల్‌ వండర్‌. కథ.. కథనాలు చాలా కొత్తగా ఉంటాయి.యాక్షన్‌కు, గ్రాఫిక్స్‌కు ఎంతో ప్రాధాన్యముంది. ఈ సినిమా కోసం మేమెంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: బి.అజనీష్‌ లోక్‌నాథ్‌, ఛాయాగ్రహణం: విలియమ్‌ డేవిడ్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని