Chiranjeevi: పవన్‌కల్యాణ్‌లా చిరంజీవి

‘భోళాశంకర్‌’ సినిమాలో  తమ్ముడు పవన్‌కల్యాణ్‌లా తాను సందడి చేయనున్నట్టు తెలిపారు అగ్ర కథానాయకుడు చిరంజీవి.

Updated : 17 Jul 2023 14:05 IST

భోళాశంకర్‌’ సినిమాలో  తమ్ముడు పవన్‌కల్యాణ్‌లా తాను సందడి చేయనున్నట్టు తెలిపారు అగ్ర కథానాయకుడు చిరంజీవి. చిరు లీక్స్‌ పేరుతో సామాజిక మాధ్యమాల్లో అప్పుడప్పుడూ తన సినిమాలకి సంబంధించిన కబుర్లని సరదాగా పంచుకుంటుంటారు చిరంజీవి. ఆదివారం ఆయన మరోసారి ఆ ప్రయత్నం చేశారు. వచ్చే నెల 11న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘భోళాశంకర్‌’లోని  ఓ సన్నివేశాన్ని పంచుకుంటూ దాని వెనక సంగతుల్ని వివరించారు. ‘‘కల్యాణ్‌బాబు తన సినిమాల్లో అప్పుడప్పుడూ నా ప్రస్తావన తీసుకొస్తూ, నా డ్యాన్సులకి స్టెప్పులేస్తుంటాడు. నా డైలాగులను అనుకరిస్తూ వినోదం పంచుతుంటాడు. అలా నేను కూడా ‘భోళాశంకర్‌’లో తన మేనరిజమ్స్‌, తన పాటని అనుకరించి వినోదం పంచుతా.

ఆస్వాదిస్తారని ఆశిస్తున్నా’’ అంటూ ‘ఖుషి’ సినిమాలోని ‘యే మేరా జహా...’  పాటలో పవన్‌ మేనరిజమ్‌ని అనుకరించిన ఓ సన్నివేశాన్ని పంచుకున్నారు.  ‘తమ్ముడి పాట మస్తుందిలే...’ అంటూ అందులో చిరంజీవి చేసిన సందడి అభిమానుల్ని అలరిస్తోంది. మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘భోళాశంకర్‌’. తమన్నా కథానాయిక. కీర్తిసురేశ్‌ కీలక పాత్ర పోషించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని