Chiranjeevi: పవన్‌ కల్యాణ్‌ మేనరిజాన్ని ఇమిటేట్‌ చేసిన చిరు.. ‘భోళాశంకర్‌’ నుంచి మరో లీక్‌!

చిరంజీవి హీరోగా మెహర్‌ రమేశ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘భోళాశంకర్‌’. ఈ సినిమా నుంచి చిరంజీవి ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.

Published : 16 Jul 2023 22:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘చిరు లీక్స్‌’ (Chiru Leaks) పేరుతో తన కొత్త సినిమాల అప్‌డేట్స్‌ని ఇస్తూ అభిమానుల్ని అలరిస్తున్నారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో తాను నటిస్తున్న ‘భోళా శంకర్‌’ (Bholaa Shankar) నుంచి ఇప్పటికే పలు లీక్స్‌ ఇవ్వగా తాజాగా మరొకటి షేర్‌ చేశారు. అదేంటంటే.. ఈ సినిమాలో చిరంజీవి తన సోదరుడు, ప్రముఖ హీరో పవన్‌ కల్యాణ్‌ మేనరిజాన్ని ఇమిటేట్‌ చేశారు. ఆ ఆసక్తికర విషయాన్ని తెలియజేస్తూ సంబంధిత వీడియోను సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు.

‘గులాబి’ కథ రాజశేఖర్‌కు చెప్పారు కానీ: జేడీ చక్రవర్తి

‘‘హాయ్‌ ఫ్రెండ్స్‌.. భోళాశంకర్‌ సినిమా నుంచి మీకోసం ఓ చిన్న విషయాన్ని లీక్‌ చేయబోతున్నా. ఈ విషయం తెలిస్తే మెహర్‌ రమేశ్‌ గొడవ చేస్తాడు. అయినా ఫర్వాలేదు. సంగతేంటంటే.. కల్యాణ్‌బాబు అప్పుడప్పుడు తన సినిమాల్లో నా ప్రస్తావన తీసుకురావడం, నా పాటలకు స్టెప్పులేయడం, నా డైలాగ్స్‌ని ఇమిటేట్‌ చేయడం.. ఇలా మిమ్మల్ని ఎంతగానో అలరించాడు. అలానే నేను భోళాశంకర్‌ సినిమాలో తనని ఇమిటేట్‌ చేశా. మీరంతా ఎంజాయ్‌ చేస్తారని అనుకుంటున్నా’’ అని వీడియోలో పేర్కొన్నారు. ఇదే వీడియోలో పవన్‌ని ఇమిటేట్‌ చేసిన గ్లింప్స్‌ చూపించారు. ఇంకెందుకు ఆలస్యం వీడియోపై ఓ లుక్కేయండి..


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని