Social Look: ఉపాసన స్పెషల్‌ ఫొటో.. మహేశ్‌ యాడ్‌.. తారకు ఐదేళ్లు

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 09 Mar 2024 00:42 IST
  • మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్త్రీలకు పలువురు సినీ తారలు శుభాకాంక్షలు తెలిపారు. తమ జీవితాల్లో స్ఫూర్తినింపిన మహిళల గురించి ప్రత్యేకంగా పోస్టులు పెట్టారు.
  • ఉమెన్స్‌ డే సందర్భంగా సురేఖ, అంజనాదేవితో దిగిన ఫొటోని ఉపాసన ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. 60 ఏళ్ల వయసులో తన అత్తయ్య వ్యాపార రంగంలోకి అడుగుపెట్టినందుకు సంతోషంగా ఉందన్నారు. వయసుతో సంబంధం లేకుండా తన అభిరుచిని ఫాలో అయ్యి.. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారన్నారు. మరెంతోమంది అమ్మలు, అత్తయ్యలు వ్యాపార రంగంలోకి అడుగుపెడితే మన దేశం గొప్పగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు.
  • ‘మేడ్‌ ఇన్‌ హెవెన్‌ సీజన్‌ 1’ విడుదలై ఐదేళ్లు అయిన సందర్భంగా శోభితా ధూళిపాళ్ల ఆసక్తికర పోస్ట్‌ పెట్టారు. ‘‘(సినిమాలోని తన పాత్రను ఉద్దేశించి) తారకు ఐదేళ్లు’’ అని రాసుకొచ్చారు.
  • ‘‘మీ కలలను మీరే సాకారం చేసుకోండి. ఎందుకంటే, వాటి కోసం వేరెవరూ పాటుపడరు’’ అనే సందేశాత్మక పోస్ట్‌ పెట్టారు నటి శ్రీలీల.

సురేఖ, అంజనాదేవితో ఉపాసన

దిశా పటానీ

శ్రీలీల

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

ఆషికా రంగనాథ్‌

నజ్రియా

శ్రద్ధాదాస్‌

నయనతార

వాణీకపూర్‌

నందిని రాయ్‌

శ్రద్ధాకపూర్‌

రాధిక పండిట్‌

నిక్కి తంబోలి

పాలక్‌ తివారీ





Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని