స్వీటీతో ఆర్‌.ఆర్‌.ఆర్‌ అంకుల్స్‌.. వీళ్ల మధ్యలో ఏం జరిగింది..? 

ఏ వయసులో చేయాల్సిన పనులు ఆ వయసులోనే చేయాలంటుంటారు. కానీ.. కొంతమంది మాత్రం కాస్త ఆలస్యంగా మేల్కొని ఎప్పుడో చేయాల్సిన పనులు ఇంకెప్పుడో చేస్తుంటారు. ఈ ‘క్రేజీ అంకుల్స్‌’ పరిస్థితి కూడా అదే. ఓ అపార్టుమెంటులో ఉండే ఆర్‌,ఆర్‌,ఆర్‌(రాజు.. రెడ్డి.. రావు) ముగ్గురు మధ్య వయస్కులు.

Published : 14 Aug 2021 23:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏ వయసులో చేయాల్సిన పనులు ఆ వయసులోనే చేయాలంటుంటారు. కానీ.. కొంతమంది మాత్రం కాస్త ఆలస్యంగా మేల్కొని ఎప్పుడో చేయాల్సిన పనులు ఇంకెప్పుడో చేస్తుంటారు. ఈ ‘క్రేజీ అంకుల్స్‌’ పరిస్థితి కూడా అదే. ఓ అపార్టుమెంటులో ఉండే ఆర్‌,ఆర్‌,ఆర్‌ (రాజు.. రెడ్డి.. రావు) ముగ్గురూ మధ్యవయస్కులు.. తాము కుర్రతనంలో చేయలేకపోయిన చిలిపి పనులు ఇప్పుడు చేద్దామని అనుకుంటారు. ఈ క్రమంలోనే ఒక అందమైన అమ్మాయి స్వీటీ (శ్రీముఖి) వెంట పడతారు. ఎలాగైనా ఆమెను లైన్లో పెట్టాలని తాపత్రయపడుతుంటారు. ఆ తర్వాత వాళ్లు ఉండే అపార్టుమెంటులోకే ఆ అమ్మాయి ఎంట్రీ ఇవ్వడంతో ముగ్గురికి చెమటలు పడతాయి. ఈ క్రమంలో వాళ్లు ఎలాంటి ఇబ్బందులు పడ్డారనేదే మిగతా కథ. సత్తిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బుల్లితెర తార శ్రీముఖి ప్రధానపాత్రలో కనిపిస్తుండగా.. క్రేజీ అంకుల్స్‌గా రాజా రవీంద్ర, మనో, భరణి సందడి చేయనున్నారు. ఈ చిత్రం ఆగస్టు 19న థియేటర్లలో విడుదల కానుంది. కాగా.. చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. ఈ చిత్రంలో పోసాని కృష్ణమురళి, గిరిధర్‌, అదుర్స్‌ రఘు, హేమ తదితరులు నటించారు. 


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని