Game Changer: ‘గేమ్‌ ఛేంజర్‌’ సాంగ్ లీక్‌.. ఇద్దరి అరెస్టు

‘గేమ్ ఛేంజర్‌’ (Game Changer) సినిమాలోని పాట ఇటీవల లీకైన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఇద్దరిని అరెస్ట్‌ చేసినట్లు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు తెలిపారు.

Published : 06 Nov 2023 15:18 IST

హైదరాబాద్‌: రామ్‌ చరణ్ (Ram Charan) - శంకర్‌ల (Shankar) కాంబోలో తెరకెక్కుతోన్న సినిమా ‘గేమ్ ఛేంజర్‌’ (Game Changer). శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్‌పై దిల్‌రాజు దీన్ని నిర్మిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఈ చిత్రంలోని ‘జరగండి జరగండి’ అనే పాట సోషల్ మీడియాలో లీకైన సంగతి తెలిసిందే. దీంతో నిర్మాత దిల్‌రాజు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సైబర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఈ లీకులకు సంబంధించి ఇద్దరిని అరెస్ట్‌ చేసినట్లు తాజాగా తెలిపారు. వారిపై ఐటీ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు.

ఇక ఎన్నో రోజులుగా ఈ సినిమా అప్‌డేట్‌ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు చిత్రబృందం ఇటీవలే ఓ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. దీపావళికి ఈ సినిమాలోని తొలి సాంగ్‌ను (జరగండి జరగండి..) విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. తమన్‌ స్వరాలు అందించిన ఈ పాట సినిమాకే హైలైట్‌ కానుందని మూవీ టీమ్ పేర్కొంది. ఇక ఈ పాటను అత్యంతభారీ బడ్జెట్‌తో తెరకెక్కించినట్లు సమాచారం. రూ.20కోట్లతో దీన్ని రూపొందించారని టాక్ వైరల్‌ అవుతుండడంతో ఈ పాట కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అలాంటి ఫొటోలు షేర్‌ చేయడానికి కారణమదే: అనన్య నాగళ్ల

ఇక ‘గేమ్ ఛేంజర్‌’ విషయానికొస్తే.. పొలిటికల్‌, యాక్షన్‌ నేపథ్యంలో సాగే పవర్‌ఫుల్‌ కథాంశంతో ఇది సిద్ధమవుతోంది. ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నట్లు సమాచారం. కియారా అడ్వాణీ హీరోయిన్‌గా కనిపించనున్నారు. ప్రస్తుతం దీని షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో అంజలి, శ్రీకాంత్‌, సునీల్‌, ఎస్‌.జె.సూర్య, సముద్రఖని, నవీన్‌ చంద్ర తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని