RRR: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అద్భుతం.. ప్రముఖ పాప్‌ సింగర్‌

ప్రముఖ పాప్‌ సింగర్‌ ఎడ్‌ షీరన్‌ (Ed Sheeran) ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాన్ని కొనియాడారు.

Published : 15 Mar 2024 15:03 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తన తదుపరి కాన్సర్ట్‌ కోసం ఇటీవల భారత్‌కు వచ్చారు ప్రముఖ పాప్‌ సింగర్‌ ఎడ్‌ షీరన్‌ (Ed Sheeran). ఇండియా అంటే తనకెంతో ఇష్టమన్నారు. ఇక్కడి ప్రజలు తన పాటలను ఎంతగానో ఎంజాయ్‌ చేస్తున్నారని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’పై ఇష్టాన్ని తెలియజేశారు. ‘‘దాదాపు ఏడాది క్రితం నా స్నేహితులతో కలిసి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వీక్షించా. ఇదొక అద్భుతమైన చిత్రం. ‘నాటు నాటు’ డ్యాన్స్‌ చాలా బాగుంది. సాంకేతికపరంగా నాకెంతో నచ్చింది’’ అని పేర్కొన్నారు. దీనిపై ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ ఆనందం వ్యక్తం చేసింది.

ప్రస్తుతం ముంబయిలో ఉన్న ఎడ్‌ షీరన్‌ కోసం బాలీవుడ్‌ సెలబ్రిటీలు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. షారుక్‌ ఏర్పాటు చేసిన పార్టీలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, జాకీ భగ్నానీ, ఫర్హా ఖాన్‌, ఆయుష్మాన్‌ ఖురానా, అర్మాన్‌ మాలిక్‌ తదితరులు పాల్గొన్నారు. షారుక్‌తో కలిసి షీరన్‌ డ్యాన్స్‌ చేశారు. ‘బుట్టబొమ్మా బుట్టబొమ్మా’ పాటకు స్టెప్పులేశారు. దీనికి సంబంధించిన పలు వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. శనివారం రాత్రి ముంబయిలో ఎడ్‌ షీరన్‌ కాన్సర్ట్‌ జరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని