Aamir Khan: ఆమిర్‌ఖాన్‌ విడాకులు.. అప్పటికి మేం రిలేషన్‌లో లేం: దర్శకురాలు

ఆమిర్‌ ఖాన్‌తో తన రిలేషన్‌షిప్‌ ఎప్పుడు మొదలైందో చెప్పారు దర్శకురాలు కిరణ్‌ రావు.

Published : 14 Mar 2024 00:08 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రీనా దత్తా నుంచి ఆమిర్‌ ఖాన్‌ (Aamir Khan) విడాకులు తీసుకోవడానికి తను కారణం కాదని ఆయన మాజీ భార్య కిరణ్‌ రావు (Kiran Rao) అన్నారు. ‘‘లగాన్‌’ టైమ్‌లోనే మా ఇద్దరి మధ్య రిలేషన్‌ మొదలైందని చాలామంది అనుకుంటున్నారు. అందులో ఎలాంటి నిజం లేదు. ‘స్వదేశ్‌’ నాటికి మేము ఒక్కటయ్యాం. ‘మంగళ్‌పాండే’ కోసం ఆమిర్‌ వర్క్‌ చేస్తుండేవాడు. అశుతోష్ గోవారికర్‌తో మేం కొన్ని వాణిజ్య ప్రకటనలు చేశాం. చాలా రోజుల తర్వాత ఆమిర్‌ నేనూ అక్కడ కలుసుకున్నాం. దాదాపు నాలుగేళ్ల తర్వాత రీకనెక్ట్‌ అయ్యాం. అప్పటివరకూ ఆయనతో టచ్‌లో లేను. ‘లగాన్‌’ టైమ్‌లో ఆయనతో మాట్లాడింది లేదు. వేరే బంధంలో ఉన్న ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు తప్పకుండా కొన్ని మాటలు భరించాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో కపుల్‌ కౌన్సిలింగ్‌ తీసుకోవడం ఉత్తమం. మేం కూడా కౌన్సిలింగ్‌కు వెళ్లాం. ఎలాంటి పరిస్థితులు వచ్చినా పరస్పరం నిజాయితీగా ఉండాలని నిర్ణయించుకున్నాం’’ అని కిరణ్‌ రావు అన్నారు.

దర్శక నిర్మాతగా కిరణ్‌ రావుకు బాలీవుడ్‌లో మంచి పేరు ఉంది. ఆమిర్‌ఖాన్‌ నటించిన ‘లగాన్‌’కు ఆమె అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వర్క్‌ చేశారు. 2005లో ఆమిర్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక బాబు ఉన్నాడు. పరస్పర అంగీకారంతో సుమారు 16 ఏళ్ల వైవాహిక బంధానికి 2021లో స్వస్తి పలికారు. కిరణ్‌రావును వివాహం చేసుకోవడానికంటే ముందు ఆమిర్‌కు వివాహమైన విషయం తెలిసిందే. 1986లో రీనాదత్తాను వివాహం చేసుకున్న ఆయన 2002లో విడాకులు తీసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని