Family Star: ఫ్యామిలీస్టార్‌ ముగించారు

‘ఫ్యామిలీస్టార్‌’గా ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమయ్యారు విజయ్‌ దేవరకొండ. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని పరశురామ్‌ తెరకెక్కించారు. దిల్‌రాజు, శిరీష్‌ సంయుక్తంగా నిర్మించారు

Updated : 17 Mar 2024 10:58 IST

‘ఫ్యామిలీస్టార్‌’గా ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమయ్యారు విజయ్‌ దేవరకొండ. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని పరశురామ్‌ తెరకెక్కించారు. దిల్‌రాజు, శిరీష్‌ సంయుక్తంగా నిర్మించారు. మృణాల్‌ ఠాకూర్‌ కథానాయిక. ఈ సినిమా తాజాగా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని విజయ్‌ సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఫ్యామిలీ, క్లాస్‌, మాస్‌, లవ్‌, యాక్షన్‌.. ఇలా అన్ని రకాల వాణిజ్యాంశాలు నిండిన ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్లో ఉన్న ఈ సినిమా ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్‌, ఛాయాగ్రహణం: కేయూ మోహనన్‌.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు