Updated : 02 Jul 2022 07:16 IST

Agni Nakshatram: తండ్రీతనయల అగ్నినక్షత్రం’

మోహన్‌బాబు (MohanBabu), లక్ష్మీప్రసన్న(Lakshmi) ప్రధాన పాత్రధారులుగా నటిస్తూ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఇద్దరూ కలిసి నటిస్తుండడం ఇదే తొలిసారి. ప్రతీక్‌ ప్రజోష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. చివరి దశ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమాకి ‘అగ్నినక్షత్రం’ (Agni Nakshatram) అనే పేరుని ఖరారు చేశారు. శుక్రవారం ఉదయం ఈ పేరుని ప్రకటించారు. ‘పోలీస్‌స్టోరీ’ వంటి ఒక విభిన్నమైన కథతో రూపొందుతోందని, విడుదలైన లుక్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయని సినీవర్గాలు తెలిపాయి. మలయాళీ నటుడు సిద్ధిఖ్‌తోపాటు, సముద్రఖని, విశ్వంత్‌, జబర్దస్త్‌ మహేష్‌, చైత్ర శుక్లా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ: డైమండ్‌ రత్నబాబు, సంగీతం: లిజో.కె జోస్‌, ఛాయాగ్రహణం: గోకుల్‌ భారతి, కూర్పు: మధురెడ్ఢి


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని