రానా-మిహికా వివాహ తేదీ ఫిక్స్‌!

దగ్గుబాటి కుటుంబంలో పెళ్లి భాజాలు మోగబోతున్న తేదీ ఖరారైంది. కథానాయకుడు రానా ఆగస్టు 8న తన ప్రేయసి మిహీకా బజాజ్‌ మెడలో మూడు ముళ్లు వేయబోతున్నారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు బుధవారం అధికారికంగా....

Updated : 11 Jun 2020 07:03 IST

ఇందులో ఎటువంటి మార్పులు లేవు

హైదరాబాద్‌: దగ్గుబాటి కుటుంబంలో పెళ్లి భాజాలు మోగబోతున్న తేదీ ఖరారైంది. కథానాయకుడు రానా ఆగస్టు 8న తన ప్రేయసి మిహీకా బజాజ్‌ మెడలో మూడు ముళ్లు వేయబోతున్నారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు బుధవారం అధికారికంగా వెల్లడించారు. ఇందులో ఎటువంటి మార్పులు ఉండవని చెప్పారు. హైదరాబాద్‌లోనే ఈ శుభకార్యాన్ని జరిపేందుకు దగ్గుబాటి, బజాజ్‌ కుటుంబ సభ్యులు ఏర్పాట్లు మొదలు పెట్టారు. పెళ్లి తంతు మూడు రోజులపాటు నిర్వహించబోతున్నట్లు తెలిసింది. పెళ్లికి రెండు రోజుల ముందు ఆగస్టు 6, 7 తేదీల్లో వేడుకలు జరగబోతున్నాయి. కుటుంబ సభ్యులు, పరిమిత సంఖ్యలో సన్నిహితుల సమక్షంలో తెలుగు, మార్వాడీ సంప్రదాయాల ప్రకారం పెళ్లి వేడుకల్ని నిర్వహించబోతున్నారు. కరోనా ప్రభావం దృష్ట్యా ప్రభుత్వ నియమ నిబంధనల మేరకే ఈ వేడుకని నిర్వహించాలని ఇరు కుటుంబాల వారు నిర్ణయించారు. నిశ్చితార్థం నిర్వహించకుండా నేరుగా పెళ్లి చేయబోతున్నారు.

రానా-మిహికా చాలా ఏళ్లుగా స్నేహితులు. ఈ క్రమంలోనే మనసులు ఇచ్చి పుచ్చుకున్నారు. ఇరు కుటుంబ సభ్యుల సమ్మతితో భార్యాభర్తలు కాబోతున్నారు. కొన్ని రోజుల క్రితం ఇరు కుటుంబాల సమక్షంలో రోకా వేడుక జరిగిన సంగతి తెలిసిందే. మిహికా వెడ్డింగ్‌ ప్లానర్‌. ‘డ్యూ డ్రాప్‌ స్టూడియో’ అనే ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీని నడుపుతున్నారు. ఆమె తల్లి బంటీ బజాజ్‌ జ్యువెలరీ డిజైనర్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని