నిహారికకు పెళ్లి కుదిరిందా..?

హీరోల వరుస పెళ్లిళ్లతో తెలుగు చిత్రపరిశ్రమలో సందడి నెలకొన్న విషయం తెలిసిందే. ఈ సందడి వాతావరణాన్ని మరింత రెట్టింపు చేస్తూ త్వరలో మెగా కుటుంబంలో పెళ్లి భజాలు మోగనున్నట్లు తెలుస్తోంది. నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల...

Published : 18 Jun 2020 14:56 IST

సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోన్న ఫొటో

హైదరాబాద్‌: హీరోల వరుస పెళ్లిళ్లతో తెలుగు చిత్రపరిశ్రమలో సందడి నెలకొన్న విషయం తెలిసిందే. ఈ సందడి వాతావరణాన్ని మరింత రెట్టింపు చేస్తూ త్వరలో మెగా కుటుంబంలో పెళ్లి బాజాలు మోగనున్నట్లు తెలుస్తోంది. నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల అతి త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారని సమాచారం. ఓ వ్యాపారవేత్తతో ఆమె వివాహం నిశ్చయమైందని, ఆగస్టులో వీరి పెళ్లి ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా నిహారిక పెట్టిన ఓ పోస్ట్‌ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఆమె స్టార్‌బక్స్‌ కాఫీ కప్పు ఫొటోను ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. అయితే ఆ కప్పుపై మిస్‌.నిహా (మిస్‌ని కొట్టివేసి) మిసెస్‌..? అని రాసి ఉంది. అయితే నిహారిక పెట్టిన పోస్ట్‌పై పలువురు నెటిజన్లు స్పందించారు. ‘నిహారిక.. మీకు పెళ్లి ఫిక్స్‌ అయ్యిందా?, త్వరలో మీరు పెళ్లి చేసుకోనున్నారా? వరుడు ఎవరు?’ అని కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు పెళ్లి విషయంపై మెగా కుటుంబం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

నాగశౌర్య కథానాయకుడిగా తెరకెక్కిన ‘ఒక మనసు’ సినిమాతో నిహారిక కథానాయికగా వెండితెరకు పరిచయమయ్యారు. 2016లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మిశ్రమ స్పందనలు అందుకుంది. అనంతరం ఆమె హ్యాపీ వెడ్డింగ్‌, సూర్యకాంతం చిత్రాల్లో కథానాయికగా మెప్పించారు. ఇటీవల చిరంజీవి నటించిన ‘సైరా’ చిత్రంలో నిహారిక అతిథి పాత్రలో కనిపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని