
Psychovarma: గుండెలోన నువ్వే..
నట్టి క్రాంతి, ముస్కాన్, సుపూర్ణ మలాకర్ నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘వర్మ’. వీడు తేడా.. అనేది ఉపశీర్షిక. నట్టి కుమార్ తెరకెక్కిస్తున్నారు. నట్టి కరుణ నిర్మాత. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో జనవరి 21న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల గుండెలోన నువ్వే’’ అనే గీతాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఎంతో హాయిగా సాగిపోతున్న ఓ సాఫ్ట్‌వేర్ కుర్రాడి జీవితంలో కొన్ని అనూహ్య సంఘటనలు చోటు చేసుకుంటాయి. దాంతో అతని జీవితం ఎలా మారిపోయింది? ఆ తర్వాత ఏం జరిగింది? అన్న ఆసక్తికర మలుపులతో సినిమా సాగుతుంది. క్రాంతి తన పాత్రలో అద్భుతంగా జీవించాడ’’న్నారు. ‘‘యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన చిత్రమిది. ఇలాంటి కథా బలమున్న చిత్రంలో నటించడం ఆనందంగా ఉంద’’న్నారు క్రాంతి. నిర్మాత మాట్లాడుతూ ‘‘మంగళవారం చిత్ర ట్రైలర్ విడుదల చేస్తామ’’న్నారు.
ఈ చిత్రానికి సంగీతం: రవిశంకర్,
ఛాయాగ్రహణం: జనార్ధన్ నాయుడు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.