Cinema News: ‘సంస్కార్‌ కాలనీ’లో ఏం జరిగింది?

‘రొమాంటిక్‌ క్రైమ్‌ కథ’, ‘గల్ఫ్‌’, ‘వలస’ లాంటి వైవిధ్యభరిత చిత్రాలతో సినీప్రియుల్ని మెప్పించిన దర్శకుడు సునీల్‌ కుమార్‌ రెడ్డి. ఇప్పుడాయన నుంచి వస్తున్న కొత్త సినిమా ‘చి69 సంస్కార్‌ కాలనీ’. ఎస్తర్‌ నోరోన్హా, అజయ్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. బి.బాపిరాజు, ముతికి నాగ సత్యనారాయణ నిర్మించారు.

Updated : 03 Feb 2022 07:46 IST

‘రొమాంటిక్‌ క్రైమ్‌ కథ’, ‘గల్ఫ్‌’, ‘వలస’ లాంటి వైవిధ్యభరిత చిత్రాలతో సినీప్రియుల్ని మెప్పించిన దర్శకుడు సునీల్‌ కుమార్‌ రెడ్డి. ఇప్పుడాయన నుంచి వస్తున్న కొత్త సినిమా ‘చి69 సంస్కార్‌ కాలనీ’. ఎస్తర్‌ నోరోన్హా, అజయ్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. బి.బాపిరాజు, ముతికి నాగ సత్యనారాయణ నిర్మించారు. ఈ సినిమా ఈ నెల మూడో వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే బుధవారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ ‘‘కమర్షియల్‌ హిట్‌ కోసం కాకుండా ఓ సామాజిక బాధ్యతతో ఈ చిత్రం చేయడం జరిగింది. స్వాతి మంత్రిప్రగడ నాకీ కథ ఇచ్చింది. ప్రస్తుత సమాజంలోని అనేక సమస్యల్ని ఇందులో చర్చించాం. అందరినీ అలరిస్తూ.. ఆలోచింపజేసేలా ఉంటుందీ చిత్రం’’ అన్నారు. ‘‘ఓ సినిమా పనిపై ముంబయి వెళ్లినప్పుడు.. అక్కడ మాకు ఎదురైన కొన్ని అనుభవాలను, పేపర్‌లో, సామాజిక మాధ్యమాల్లో వచ్చిన కొన్ని యథార్థ సంఘటనలను తీసుకుని ఈ చిత్రం చేశాం. ఇందులో చక్కటి సందేశముంది. మా గత చిత్రాల్లాగే ఈ సినిమానీ ఆదరించాలని ప్రేక్షకుల్ని కోరుకుంటున్నా’’ అన్నారు నిర్మాత. ఈ కార్యక్రమంలో కథా రచయిత స్వాతి, ఎడిటర్‌ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్‌ ఇమ్మడి, ఛాయాగ్రహణం: ఎస్‌.వి.శివరాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని