Pratinidhi 2 Teaser: ప్రతినిధి పిలుపు

‘‘ఇప్పటికైనా కళ్లు తెరవండి. ఒళ్లు విరిచి బయటకొచ్చి ఓటేయండి...’’ అంటూ ఓటర్లకు పిలుపునిచ్చాడు బాధ్యత కలిగిన ఓ జర్నలిస్ట్‌.

Updated : 30 Mar 2024 11:51 IST

‘‘ఇప్పటికైనా కళ్లు తెరవండి. ఒళ్లు విరిచి బయటకొచ్చి ఓటేయండి...’’ అంటూ ఓటర్లకు పిలుపునిచ్చాడు బాధ్యత కలిగిన ఓ జర్నలిస్ట్‌. ప్రజల గొంతుకగా మారి నాయకుల్ని ప్రశ్నించడంతోపాటు, వాళ్ల నుంచి ఎదురైన ఎన్నో సవాళ్లకు ఎదురొడ్డి నిలిచిన ఆ జర్నలిస్ట్‌ కథేమిటో తెలియాలంటే ‘ప్రతినిధి 2’ చూడాల్సిందే. నారా రోహిత్‌ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. సిరీ లెల్ల, దినేశ్‌ తేజ్‌, సప్తగిరి, జిషు సేన్‌ గుప్తా కీలక పాత్రలు పోషించారు. జర్నలిస్ట్‌ మూర్తి దేవగుప్తపు దర్శకత్వం వహించారు. కుమార్‌ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీతోట, సురేంద్రనాథ్‌ బొల్లినేని నిర్మాతలు. ‘ప్రతినిధి’కి కొనసాగింపుగా రూపొందిన ఈ సినిమా టీజర్‌ని శుక్రవారం అగ్ర కథానాయకుడు చిరంజీవి విడుదల చేశారు. ‘‘కథానాయకుడు నారా రోహిత్‌ మరోసారి బలమైన పాత్రలో, గాఢమైన నటనతో కట్టిపడేస్తారు. దర్శకుడు మూర్తి దేవగుప్తపు తన రచన, దర్శకత్వంతో ఆకట్టుకుంటారు. ఏప్రిల్‌ నెలలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ’’ని సినీ వర్గాలు తెలిపాయి. సచిన్‌ ఖేడేకర్‌, తనికెళ్ల భరణి, ఇంద్రజ, ఉదయభాను, శ్రీ,  అజయ్‌ ఘోష్‌, అజయ్‌, ప్రవీణ్‌, పృథ్వీరాజ్‌, రఘుబాబు, రఘు కారుమంచి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: మహతి స్వరసాగర్‌, కూర్పు: రవితేజ గిరిజాల, ఛాయాగ్రహణం: నాని చమిడిశెట్టి, కళ: కిరణ్‌ కుమార్‌ మన్నె.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని