బన్నీ స్టైలిష్‌ ఫైట్‌ చూశారా..!

టాలీవుడ్‌ స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌ సంక్రాంతి సెలబ్రేషన్స్‌ ప్రారంభమయ్యాయి. ఆయన కథానాయకుడిగా నటించిన ‘అల..వైకుంఠపురములో..’ సంక్రాంతి పండుగ సందర్భంగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది..

Updated : 31 Oct 2023 16:35 IST

అల్లుఅర్జున్‌ను అభినందించిన గంటా శ్రీనివాసరావు

 

హైదరాబాద్‌: టాలీవుడ్‌ స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌ సంక్రాంతి సెలబ్రేషన్స్‌ ప్రారంభమయ్యాయి. ఆయన కథానాయకుడిగా నటించిన ‘అల..వైకుంఠపురములో..’ సంక్రాంతి పండుగ సందర్భంగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయం వైపు దూసుకెళుతోంది. అనుకున్నట్లుగానే సినిమా హిట్‌ కావడంతో అల్లు అర్జున్‌.. ‘సంక్రాంతి విన్నర్‌’ అని పేర్కొంటూ ‘అల..వైకుంఠపురములో..’ సినిమా నుంచి ఓ స్పెషల్‌ వీడియోను పోస్ట్‌ చేశారు. అల్లు అర్జున్‌ స్టైలిష్‌గా ఫైట్‌ చేస్తోన్న ఈ వీడియో చూసి అభిమానులు మరోసారి బన్నీ స్టైల్‌కు ఫిదా అయిపోతున్నారు.

మరోవైపు గ్యాప్‌ తీసుకున్నప్పటికీ మంచి సినిమాతో సంక్రాంతికి బన్నీ హిట్‌ కొట్టాడంటూ సినీ ప్రేక్షకులు, నెటిజన్లు ‘అల..వైకుంఠపురములో..’ టీంను ప్రశంసిస్తున్నారు. ఈ నేపథ్యంలో గంటా శ్రీనివాసరావు ట్విటర్‌ వేదికగా ‘అల..వైకుంఠపురములో..’ చిత్రబృందాన్ని అభినందిస్తూ ఓ ట్వీట్‌ పెట్టారు. ‘అల్లు అర్జున్‌కు బ్లాక్‌ బస్టర్‌ కంగ్రాట్స్‌. సంక్రాంతికి మంచి విజయాన్ని సాధించిన ‘అల..వైకుంఠపురములో’ చిత్రబృందానికి నా అభినందనలు.’ అని ఆయన పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా ఈ రోజు ఉదయం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఉన్న సంధ్య థియేటర్‌లో అభిమానులతో కలిసి బన్నీ, త్రివిక్రమ్‌తోపాటు కథానాయిక పూజాహెగ్డే ‘అల..వైకుంఠపురములో..’ సినిమా వీక్షించారు. దీంతో థియేటర్‌ వద్ద సందడి నెలకొంది. దీనికి సంబంధించిన ఓ ఫొటోలను పూజా హెగ్డే ట్విటర్‌ వేదికగా షేర్‌ చేస్తూ.. ‘బ్లాక్‌బస్టర్‌.. ఆడియన్స్‌తో కలిసి సినిమా చూడడాన్ని బాగా ఎంజాయ్‌ చేశాం. మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు.’అని పూజా తెలిపారు. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుండడంతో చిత్రబృందం సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ చేసుకుంటున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని