#OMGDaddy: ఫుల్‌ సాంగ్‌ చూశారా?

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అల వైకుంఠపురములో’. పూజా హెగ్డే కథానాయిక. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని సొంతం

Updated : 24 Feb 2020 09:52 IST

హైదరాబాద్‌: అల్లు అర్జున్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అల వైకుంఠపురములో’. పూజా హెగ్డే కథానాయిక. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అల్లు అర్జున్‌ నటన, త్రివిక్రమ్‌ టేకింగ్‌, పూజా హెగ్డే అందాలు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ముఖ్యంగా తమన్‌ అందించిన పాటలు నెటిజన్లను ఓ ఊపు ఊపేశాయి.

‘సామజవరగమన’, ‘బుట్టబొమ్మ’, ‘ఓ మై గాడ్‌ డాడీ’ పాటలు యువతను విశేషంగా అలరించాయి. ఇటీవల ‘సామజవరగమన’ ఫుల్‌ సాంగ్‌ను విడుదల చేసిన చిత్ర బృందం. తాజాగా ‘మై గాడ్‌ డాడీ’ పాటను అభిమానులతో పంచుకుంది. తమన్‌ అందించిన స్వరాలకు కృష్ణచైతన్య సాహిత్యం అందించగా, తెలుగు ర్యాపర్‌ రోల్‌ రైడా, బ్లేజీలు ఈ గీతాన్ని ఆలపించారు. 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని