గౌతమ్‌ని హీరోగా చూసే ఛాన్స్‌ఉందా..?

వయసు పెరిగేకొంది మరింత అందంగా కనిపిస్తూ ఎందరో అభిమానుల హృదయాలను కొల్లగొడుతున్నారు టాలీవుడ్‌ అగ్రకథానాయకుడు మహేశ్‌బాబు. ఒక్కసారి ఆయన ఆన్‌లైన్‌లోకి వస్తే ఆయన ఫిట్‌నెస్‌ రహస్యాన్ని తెలుసుకోవాలని అభిమానులు ఆశగా ఎదురుచూశారు. తాజాగా ఆయన నటించిన ‘సరిలేరునీకెవ్వరు’...

Updated : 19 Jan 2020 18:44 IST

మహేశ్‌బాబు సమాధానం ఏమిటంటే..

హైదరాబాద్‌: వయసు పెరిగేకొంది మరింత అందంగా కనిపిస్తూ ఎందరో అభిమానుల హృదయాలను కొల్లగొడుతున్నారు టాలీవుడ్‌ అగ్రకథానాయకుడు మహేశ్‌బాబు. ఒక్కసారి ఆయన ఆన్‌లైన్‌లోకి వస్తే ఆయన ఫిట్‌నెస్‌ రహస్యాన్ని తెలుసుకోవాలని అభిమానులు ఆశగా ఎదురుచూశారు. తాజాగా ఆయన నటించిన ‘సరిలేరునీకెవ్వరు’ చిత్రం బాక్ల్‌బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకుని ఎన్నో రికార్డులను కొల్లగొట్టి బాక్సాఫీస్‌ వద్ద దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో మహేశ్‌బాబు సోషల్‌మీడియా వేదికగా తన అభిమానులతో సరదాగా ముచ్చటించారు. తన ఫిట్‌నెస్‌ రహస్యంతోపాటు మరెన్నో ఆసక్తికర విషయాలను నెటిజన్లతో పంచుకున్నారు. ఆ విశేషాలివి..

నమ్రతలో మీకు బాగా నచ్చిన లక్షణం ఏమిటి?

మహేశ్‌: తను ముక్కుసాటిగా వ్యవహరించే వ్యక్తి. ఆమెలో నువ్వు ఏం చూస్తే అదే నీకు తిరిగి వస్తుంది.

సరిలేరునీకెవ్వరు చిత్రానికి దేవిశ్రీ అందించిన బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ విన్నాక ఎలా అనిపించింది?

మహేశ్‌: దేవిశ్రీ అందించిన బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ చాలా అద్భుతంగా ఉంది. దేవిశ్రీ మ్యూజిక్‌తో సినిమాని మరోస్థాయికి తీసుకెళ్లాడు.

ఇటీవల అభిమానులతో ఫొటోషూట్‌ పెట్టారు కదా. భవిష్యత్తులో అలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని కోరుకుంటున్నాను..!

మహేశ్‌: తప్పకుండా ప్రయత్నిస్తాను. అభిమానులతో కలిసి ఫొటోలు దిగడం చాలా సంతోషంగా అనిపించింది. భవిష్యత్తులో ఇలాంటివి మరిన్ని జరిగేలా చూస్తాను.

మీరింత హ్యాండ్సమ్‌గా ఉండడానికి గల రహస్యం ఏమిటి?

మహేశ్‌: ఫిట్‌, ఆరోగ్యంగా ఉండేందుకు కష్టపడి పనిచేస్తాను

మైండ్‌బ్లాక్‌ సాంగ్‌లో ఎనర్జీటిక్‌ డ్యాన్స్‌ చేయడం ఎలా అనిపించింది?

మహేశ్‌: మైండ్‌ బౌలింగ్‌

సరిలేరునీకెవ్వరుకి మీరందుకున్న బెస్ట్‌ కాంప్లిమెంట్‌ ఏమిటి?

మహేశ్‌: మా నాన్న నుంచి నాకు బెస్ట్‌ కాంప్లిమెంట్‌ వచ్చింది. అలాగే గౌతమ్‌ ఈ సినిమాను మూడు సార్లు చూశాడు. అదే నాకు పెద్ద కాంప్లిమెంట్‌.

మొదటిసారి ఆర్మీ మేజర్‌ పాత్రలో నటించడం ఎలా ఉంది?

మహేశ్‌: ఒక సైనికుడి పాత్రలో నటించినందుకు నాకెంతో గర్వంగా అనిపించింది

మీకు ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు?

మహేశ్‌: గౌతమ్‌, సితార పుట్టినరోజు నాకెప్పటికీ గుర్తుంటుంది

నటుడు కాకపోతే ఏమయ్యేవారు?

మహేశ్‌: నాకు ఇప్పటివరకూ అలాంటి ఆలోచనే రాలేదు. ఎందుకంటే నాలుగేళ్ల వయసు నుంచి నటన ఒక్కటే నాకు తెలుసు

మీ ఫిటెనెస్‌ సీక్రెట్‌ ఏమిటి?

మహేశ్‌: సరిగ్గా తింటాను. చక్కగా నిద్రిస్తాను. అలాగే వర్కౌట్లు చేస్తాను.

సరిలేరునీకెవ్వరు సినిమా చూశాక మీ రియాక్షన్‌ ఏమిటి?

మహేశ్‌: సినిమా చూడగానే మా డైరెక్టర్‌ను గట్టిగా హత్తుకున్నాను

సరిలేరునీకెవ్వరు విజయంపై విజయశాంతిగారి స్పందన ఏమిటి?

మహేశ్‌: తను రీఎంట్రీ ఇచ్చిన సినిమా బ్లాక్‌బస్టర్‌ అవ్వడంతో ఆమె చాలా సంతోషంగా ఉన్నారు

మీ అభిమానుల గురించి ఒక్కమాటలో చెప్పండి?

మహేశ్‌: నిజాయతీపరులు

మీ తదుపరి సినిమాలో కృష్ణగారిని చూడవచ్చా?

మహేశ్‌: మా నాన్నతో పనిచేయాలని నాకెంతో ఆసక్తిగా ఉంది. ఒకవేళ అలాంటి ఛాన్స్‌ వస్తే తప్పకుండా చేస్తా.

చిత్రపరిశ్రమలో మీకు స్ఫూర్తి ఎవరు?

మహేశ్‌: నా స్ఫూర్తి, మెంటర్‌, గైడ్‌ అన్నీ మా నాన్నే   

మీరెందుకు అంత అందంగా ఉంటారు?

మహేశ్‌: నాకేం తెలుసు. మీరే చెప్పాలి

సరిలేరు నీకెవ్వరు చూశాక కృష్ణగారి స్పందన ఏమిటి?

మహేశ్‌: చాలా సంతోషించారు. అలాగే గర్వంగా ఫీల్‌ అయ్యారు.

టక్కరిదొంగ నుంచి సరిలేరు నీకెవ్వరు వరకూ మీకు మంచి స్పందన లభించిన చిత్రమేది?

మహేశ్‌: సరిలేరు నీకెవ్వరు. నా అభిమానులందరికీ థ్యాంక్యూ

సినీ జీవితం.. వ్యక్తిగత జీవితంపై ఏదైనా ప్రభావాన్ని చూపుతుందా?

మహేశ్‌: నెవర్‌

విజయశాంతితో కలిసి పనిచేయడం ఎలా ఉంది?

మహేశ్‌: చాలా సంవత్సరాల తర్వాత ఆమెతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా అనిపించింది

మీ ఫేవరెట్‌ ఫుడ్ ఏమిటి?

మహేశ్‌: అన్నం పప్పుచారు

ఏ జోనర్‌ చిత్రాలంటే మీకు ఇష్టం?

మహేశ్‌: ఆకట్టుకునే కథ ఉంటే ఏ జోనర్‌ సినిమా అయినా నాకు ఇష్టమే

గౌతమ్‌, సితార గురించి ఒక్కమాటలో చెప్పండి?

మహేశ్‌: నా సర్వస్వం

గౌతమ్‌ను హీరోగా చూసే ఛాన్స్‌ ఉందా?

మహేశ్‌: ప్రస్తుతం తను చదువుకుంటున్నాడు. ఇంత త్వరగా దాని గురించి మాట్లాడాల్సిన అవరసం లేదనుకుంటున్నాను.

అనిల్‌రావిపూడితో వర్క్‌ చేయడం ఎలా ఉంది?

మహేశ్‌: నేను అభిమానించే దర్శకుల్లో అనిల్‌ ఒకరు. సెట్‌లో ఉన్నప్పుడు ఆయన ఎనర్జీని మాటల్లో చెప్పలేను. నటీనటుల నుంచి తనకేమి కావాలనే విషయంలో ఆయనకు పూర్తి క్లారిటీ ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని