NTR: ‘తెలియకపోతే ఎందుకు వేసినట్టు?’

తెలుగు చిత్ర పరిశ్రమలో పౌరాణిక పాత్రలంటే మనకు గుర్తొచ్చే నటుడు నందమూరి తారక రామారావు. రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు, కర్ణుడు ఇలా పాత్ర ఏదైనా దానికి జీవం పోయగల నటుడాయన.

Published : 13 Jun 2023 14:39 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తెలుగు చిత్ర పరిశ్రమలో పౌరాణిక పాత్రలంటే మనకు గుర్తొచ్చే నటుడు నందమూరి తారక రామారావు. రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు, కర్ణుడు ఇలా పాత్ర ఏదైనా దానికి జీవం పోయగల నటుడాయన. అలాంటి పాత్రలున్న చిత్రాల్లో ఆయన నటించిన అద్భుతమైన సినిమా ‘భీష్మ’(1962).

‘భీష్మ’ విడుదలైనప్పుడు ప్రేక్షకులు విరగబడి మరీ చూశారట. అయితే ఆ చిత్ర నిర్మాత, దర్శకుడు బి.ఎ.సుబ్బారావు తీసిన ‘చెంచులక్ష్మి’ (1958) చిత్రం స్థాయి విజయాన్ని అందుకోలేదు. చాలా కేంద్రాల్లో ‘చెంచులక్ష్మి’ శత దినోత్సవాలు జరుపుకొంది. అక్కినేని, అంజలిదేవి అంతా పాల్గొన్నారు. అయితే, ‘భీష్మ’ జరుగుతున్నప్పుడు మాత్రం అందరిలోనూ ఆసక్తి పెరిగింది. యన్‌.టి.రామారావు భీష్ముడి పాత్ర చెయ్యడం పెద్ద ఆకర్షణ. యౌవనం నుంచి వృద్ధ పాత్ర వరకూ ఉంటుంది. గడ్డాలు, మీసాలతో ఉన్న వృద్ధ పాత్రే ఎక్కువ.

హరిబాబు తయారు చేసిన విగ్గు, గడ్డం, మీసంలో ఎన్టీఆర్‌ను చూస్తే నిజంగా భీష్ముడే అనిపిస్తారు. ఈ సినిమా చేస్తున్న సమయంలో ఎన్టీఆర్‌.. ప్రముఖ దర్శక, నిర్మాత చక్రపాణిని కలిశారు. ‘నా గెటప్‌ చూసి ఎవరూ నన్ను గుర్తుపట్టడం లేదు’’ అని చక్రపాణితో రామారావు అంటే.. ‘గుర్తు పట్టకపోతే ఎలా? నువ్వు అని తెలియకపోతే ఎందుకు వేసినట్టు ఆ వేషం? దండగ కదా!’ అన్నారుట నవ్వుతూ చక్రపాణి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని