జీవితం చాలా భయంకరంగా ఉంది: ఆర్జీవీ

ప్రస్తుతం నిజ జీవితం చాలా భయంకరంగా ఉందని అంటున్నారు ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచంవ్యాప్తంగా క్లిష్ట పరిస్థితులు నెలకొని ఉన్న విషయం తెలిసిందే. మనదేశంలో కూడా రోజురోజూకీ విస్తరిస్తున్న కరోనా గురించి...

Published : 24 Apr 2020 21:15 IST

ఇప్పటికీ ఆ పుస్తకాలు చదువుతున్నారా..!

హైదరాబాద్‌: ప్రస్తుతం నిజ జీవితం చాలా భయంకరంగా ఉందని అంటున్నారు ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా క్లిష్ట పరిస్థితులు నెలకొని ఉన్న విషయం తెలిసిందే. మనదేశంలో కూడా రోజురోజూకీ విస్తరిస్తున్న కరోనా గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఆర్జీవీ తనదైన శైలిలో ‘కరోనా ఓ పురుగు’ అని పేర్కొంటూ ఓ పాట కూడా పాడారు. ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ట్విటర్‌ వేదికగా ఆర్జీవీని ఉద్దేశిస్తూ ఓ ట్వీట్‌ పెట్టారు. 

‘1988లో ఆర్జీవీ ఓ పుస్తకాల పురుగు అని నాకు తెలుసు. కానీ ఇప్పుడు ఆయన కరోనా పురుగును గురించి తెలుసుకునే విషయంలో బిజీగా ఉన్నారు. సర్‌, ఇప్పటికీ మీరు స్టీఫెన్ హాకింగ్‌ రచనలను చదువుతున్నారా?’ అని కీరవాణి ట్వీట్‌ చేశారు. మరోవైపు కీరవాణి పెట్టిన ట్వీట్‌పై ఆర్జీవీ స్పందిస్తూ.. ‘లేదు సర్ ఆయన రచనలను చదవడం లేదు. ఆయన రాసిన కల్పిత కథల కంటే మన నిజ జీవితం చాలా భయకరంగా ఉంది.’ అని ఆర్జీవీ అన్నారు.

ఇదీ చదవండి

‘కరోనా ఓ నీచమైన పురుగు’.. వర్మ పాట విన్నారా!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని