లైంగిక వేధింపులతో నటనకు దూరమయ్యా..!

ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖుల నుంచి లైంగిక వేధింపులు ఎదురవడంతో తాను నటనకు దూరమయ్యానని తమిళ నటి కల్యాణి అన్నారు. తమిళంలో తెరకెక్కిన ‘జయం’, ‘అలై తండా వానమ్‌’, ‘ఎస్‌ఎంఎస్‌’....

Published : 31 May 2020 21:06 IST

నటి కల్యాణి

చెన్నై: ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖుల నుంచి లైంగిక వేధింపులు ఎదురవడంతో తాను నటనకు దూరమయ్యానని తమిళ నటి కల్యాణి తెలిపారు. తమిళంలో తెరకెక్కిన ‘జయం’, ‘అలై తండా వానమ్‌’, ‘ఎస్‌ఎంఎస్‌’ సినిమాలతోపాటు తెలుగులో ‘మళ్లీ మళ్లీ’ చిత్రంలో నటించి ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాలు, సీరియల్స్‌తో ప్రేక్షకులను మెప్పించిన ఆమె కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఈ విషయంపై ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. 

‘ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొత్తలోనే ప్రభుదేవాతో కలిసి ‘అలై తండా వానమ్‌’ చిత్రంలో నటించాను. నటిగా ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను అలరించాను. అయితే హీరోయిన్‌గా మంచి అవకాశాలు వస్తోన్న తరుణంలో కొత్త మంది వ్యక్తుల నుంచి మా అమ్మకు ఫోన్‌ కాల్స్‌ వచ్చాయి. సినిమాల్లో నటించాలంటే కొన్ని విషయాల్లో నేను సర్దుకుపోవాలని వాళ్లు అన్నారు. సదరు వ్యక్తుల మాటలతో సినీ ఇండస్ట్రీకి దూరమయ్యాను. కొంతకాలానికి బుల్లితెరలో నటించడానికి అవకాశాలు వచ్చాయి. అలా పలు సీరియల్స్‌లో నటించి బుల్లితెరలో పేరు తెచ్చుకున్నాను. అయితే బుల్లితెరలో కూడా లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. దాంతో నేను నటనకు దూరమయ్యాను. ప్రస్తుతం కుటుంబంతో సంతోషంగా జీవిస్తున్నాను’ అని కల్యాణి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని