Suriya 43: సూర్య 43వ చిత్రంపై అప్‌డేట్‌ ఇచ్చిన మ్యూజిక్‌ డైరెక్టర్‌

తమిళ హీరో సూర్య కొత్త సినిమా ‘సూర్య43’గురించి మ్యూజిక్‌ డైరెక్టర్‌ జీవీ ప్రకాశ్‌ కొత్త అప్‌డేట్‌ ఇచ్చారు.

Published : 17 Mar 2024 22:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తమిళ అగ్ర కథానాయకుడు సూర్య (Suriya),  సుధా కొంగరాల దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. ‘సూరారై పోట్రు’ (ఆకాశం నీ హద్దురా) తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న మరో చిత్రమిది. దీంతో చిత్ర పరిశ్రమలో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. సూర్య43 (Suriya 43) వర్కింగ్‌ టైటిల్‌తో సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తోంది. ఇందులో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్‌, నటి నజ్రియా, బాలీవుడ్‌ నటుడు విజయ్‌ వర్మ కీలక పాత్రలు పోషించనున్నారు. జీవీ ప్రకాశ్‌ సంగీతం అందించే 100వ చిత్రం ఇది కావడం విశేషం. ఇటీవల జీవీ ప్రకాశ్‌ ఓ ఆన్‌లైన్‌ మీడియాతో ఈ సినిమా అప్‌డేట్‌ను షేర్‌ చేసుకున్నారు.

‘‘సూర్య43  కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. త్వరలో చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ ఏడాది చివరిలో నవంబరు లేదా డిసెంబరులో ఈ చిత్రం విడుదల అయ్యే అవకాశం ఉంది’’ అని తెలిపారు. ఈ పీరియాడిల్‌ డ్రామా ‘పురాణనూరు’ పేరుతో టైటిల్‌ ముగుస్తుంది. గతంలో  దీనికి సంబంధిన పోస్టర్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. ప్రస్తుతం సూర్య ‘కంగువా’లో నటిస్తున్నారు. ఈ సినిమాకు శివ దర్శకత్వం వహిస్తున్నారు. దిశా పఠానీ కథానాయిక. బాబీ దేవోల్‌ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. జగపతి బాబు, యోగిబాబు, తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వేసవి కానుకగా ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని