HanuMan: అయోధ్య రామ మందిరం.. ‘హను-మాన్‌’ విరాళం ఎన్ని కోట్లంటే..?

అయోధ్య రామ మందిరానికి ఇవ్వనున్న విరాళంపై ‘హను-మాన్‌’ (Hanuman) బృందం తాజాగా పోస్టర్‌ విడుదల చేసింది.

Updated : 21 Jan 2024 13:46 IST

హైదరాబాద్‌: సినిమా విడుదలకు ముందే చెప్పిన మాటను ‘హను-మాన్‌’ (Hanu- Man) చిత్ర బృందం నిలబెట్టుకుంది. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో వెల్లడించినట్లుగా టికెట్‌పై రూ.5 చొప్పున అయోధ్య రామ మందిరానికి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకూ 53,28,211 టికెట్లు అమ్ముడు కాగా.. వాటి ద్వారా వచ్చిన రూ.2,66,41,055 విరాళంగా ఇస్తున్నట్లు చెప్పింది. ‘హనుమాన్‌ ఫర్‌ శ్రీరామ్‌’ అని పేర్కొంటూ ఈ వివరాలను బహిర్గతం చేసింది. చిత్రబృందంతోపాటు, నిర్మాత నిరంజన్‌ రెడ్డిని సినీ ప్రియులు, నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.

Rashmika: అలా చేయడం నేరం..: రష్మిక

తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్‌ వర్మ (Prasanth Varma) తెరకెక్కించిన చిత్రం ‘హను-మాన్‌’ (Hanuman). అమృతా అయ్యర్‌ కథానాయిక. వరలక్ష్మి శరత్‌కుమార్‌, వినయ్‌ రాయ్‌, గెటప్‌ శ్రీను, వెన్నెల కిషోర్‌ కీలక పాత్రలు పోషించారు. ‘కోటి’ అనే వానరం పాత్రకు ప్రముఖ హీరో రవితేజ వాయిస్‌ ఓవర్‌ అందించడం విశేషం. అంజనాద్రి అనే కల్పిత ప్రాంతం చుట్టూ అల్లుకున్న కథ ఇది. సూపర్‌ హీరో కథకు ఇతిహాసాన్ని ముడిపెట్టి ప్రశాంత్‌ వర్మ తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. విజువల్‌ ఎఫెక్ట్స్‌ సినిమాకే హైలైట్‌గా నిలిచాయి.

నాగచైతన్య ప్రశంసలు..

నటుడు నాగచైతన్య (Naga Chaitanya) తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించారు. చిత్రబృందాన్ని మెచ్చుకుంటూ ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు. ‘‘హను-మాన్‌’తో బ్లాక్‌బస్టర్‌ అందుకున్న ప్రశాంత్‌ వర్మకు అభినందనలు. కథ, దానిని స్క్రీన్‌పైకి తీసుకువచ్చిన తీరు అద్భుతం. సినిమా ఆద్యంతం నీ యూనివర్స్‌లో లీనమయ్యా. హనుమంతుగా తేజ సజ్జా అద్భుతమైన నటన కనబరిచాడు. చిత్ర బృందానికి నా అభినందనలు’’ అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని