Suriya: హీరో సూర్య ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌.. రీ రిలీజ్‌ వాయిదా

సూర్య నటించిన ‘సూర్య s/o కృష్ణన్‌’ (Surya S/o Krishnan) సినిమా రీ రిలీజ్‌ను వాయిదా వేశారు. ఈ మేరకు తాజా విడుదల తేదీని ప్రకటించారు.

Published : 16 Jul 2023 16:50 IST

హైదరాబాద్: ప్రస్తుతం రీ రిలీజ్‌ల ట్రెండ్‌ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలామంది స్టార్‌ హీరోల సినిమాలు వచ్చి ఫ్యాన్స్‌ను అలరించాయి. కోట్లు వసూళ్లు చేసి రికార్డు సృష్టించాయి. దీంతో హీరో సూర్య (Suriya) నటించిన ‘సూర్య s/o కృష్ణన్‌’ (Surya S/o Krishnan) సినిమాను ఆయన పుట్టినరోజు సందర్భంగా రీ రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ ఇటీవల ప్రకటించారు. అయితే, తాజాగా కొన్ని కారణాల వల్ల రీ రిలీజ్‌ వాయిదా వేస్తున్నట్లు ప్రతినిధులు తెలిపారు.

సూర్య అభిమానులందరికీ క్షమాపణలు చెబుతూ ఒక నోట్‌ను రిలీజ్‌ చేశారు. ‘‘జులై 21న ఈ సినిమాను రీ రిలీజ్ చేయాలని భావించాం. అనుకున్న సమయానికి థియేటర్లలో విడుదల చేయడం పెద్ద సవాలుగా మారింది. గతంలో ఈ సినిమాకు వచ్చిన భారీ ప్రేక్షకాదరణను దృష్టిలో పెట్టుకుని ఈ రీ రిలీజ్‌ను వాయిదా వేస్తున్నాం. ‘సూర్య s/o కృష్ణన్‌’ రీ రిలీజ్‌ ప్రతి ఒక్కరినీ అలరించాలనే ఉద్దేశంతో వచ్చే నెల 4వ తేదీకి (ఆగస్టు 4) దీన్ని వాయిదా వేస్తున్నాం’’అని పేర్కొన్నారు. దీంతో సూర్య అభిమానులు నిరాశకు గురవుతున్నారు.

ఒక్క రూపాయి ఇవ్వకపోయినా.. ఆయనతో కలిసి నటించేవాణ్ని: విజయ్‌ సేతుపతి

గౌతమ్‌ వాసుదేవ్ మేనన్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 2008లో విడుదలై సూపర్‌ హిట్‌ను సొంతం చేసుకుంది. సూర్య ద్విపాత్రాభినయంతో అలరించిన ఈ చిత్రంలో ఆయన సరసన సమీరా రెడ్డి(Sameera Reddy), సిమ్రాన్‌ (Simran) నటించారు. యూత్‌ను ఎంతగానో ఆకట్టుకున్న ఈ చిత్రంలోని పాటలు నేటికీ సోషల్ మీడియాలో వైరలవుతూనే ఉన్నాయి. తాజాగా విడుదల చేసిన ఈ రీరిలీజ్ ట్రైలర్‌కు కూడా మంచి ప్రేక్షకాదరణను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని