Oscars 2024: ఆస్కార్‌కు వచ్చిన శునకం.. నెటిజన్ల కామెంట్లు హైలైట్‌..

ఈ ఏడాది జరిగిన ఆస్కార్‌ అవార్డుల వేడుకలో ఓ శునకం అందరి మనసులు దోచేసింది.

Published : 11 Mar 2024 15:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌:  అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ఈ ఏడాది ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో ఓ శునకం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసినా దీని గురించే ప్రస్తావన. ఆస్కార్‌ కోసం వివిధ విభాగాల్లో పోటీపడిన చిత్రాల్లో ‘అనాటమీ ఆఫ్‌ ఎ ఫాల్‌’ ఒకటి. బెస్ట్‌ ఒరిజినల్‌ స్క్రీన్‌ ప్లే కేటగిరీలో ఇది అవార్డును సొంతం చేసుకుంది. ఈ సినిమాలో నటించిన మెస్సీ (శునకం) కూడా అవార్డుల ప్రదానోత్సవానికి వచ్చింది. అంతేకాదు అవార్డులు అందుకున్న వారిని ప్రోత్సహిస్తూ చప్పట్లు కూడా కొట్టింది. దాంతో ఈ ఏడాది వేడుకలో ఇదే స్పెషల్ అని అక్కడికి వచ్చిన ప్రముఖులందరూ దానితో సెల్ఫీలు దిగారు. ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుండగా నెటిజన్లు దీనిపై ఫన్నీ కామెంట్స్‌ పెడుతున్నారు. ‘దీనికి ఇప్పుడే ఆస్కార్‌ ఇవ్వండి’ అని ఒకరు కామెంట్ పెట్టగా.. ‘మెస్సీ ది డాగ్‌ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్ అవార్డు తీసుకోడానికి సిద్ధంగా ఉంది’ అని మరొకరు పోస్ట్‌ పెట్టారు. ‘ఈ ఏడాది వేడుకల్లో దీని చప్పట్లు బెస్ట్ మూమెంట్‌’ అని ఇంకొకరు స్పందించారు. ఆ పోస్ట్‌లు మీరూ చూసేయండి.





Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని