Rajkundra Case: రాజ్‌కుంద్రా తప్పుడు పనులు చేయిస్తాడనుకోలేదు!
శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా అసభ్యకరమైన పనులు చేపిస్తాడనుకోలేదని నటి షెర్లిన్‌చోప్రా తెలిపారు. కుంద్రా కేసులో భాగమైన షెర్లిన్‌ను తాజాగా ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారించారు. ఎనిమిది గంటలపాటు జరిగిన సుదీర్ఘ విచారణలో....
షెర్లిన్ కన్నీటిపర్యంతం
ముంబయి: శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా అసభ్యకరమైన పనులు చేపిస్తాడనుకోలేదని నటి షెర్లిన్‌చోప్రా తెలిపారు. కుంద్రా కేసులో షెర్లిన్‌ను తాజాగా ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారించారు. ఎనిమిది గంటలపాటు జరిగిన సుదీర్ఘ విచారణలో రాజ్‌కుంద్రా ప్రొడక్షన్ హౌస్ గురించి అడిగి తెలుసుకున్నారు. విచారణ అనంతరం ఓ జాతీయ మీడియాకు షెర్లిన్ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. కుంద్రా అబద్ధాలు చెప్పి మభ్యపెట్టాడని ఆరోపించారు. అశ్లీల చిత్రాలు సర్వసాధారణమేనని ఆయన చెప్పాడని షెర్లిన్ వివరించారు.
‘‘ఈ మొత్తం వ్యవహారం గురించి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. ఇలాంటి కేసులో భాగమవుతానని ఎప్పుడూ అనుకోలేదు. రాజ్‌కుంద్రాని మొదటిసారి కలిసినప్పుడు నా జీవితం మారిపోతుందని భావించా. కెరీర్‌లో బ్రేక్ లభిస్తుందనుకున్నా. శిల్పాశెట్టి భర్త నాతో ఇలాంటి తప్పుడు వ్యవహారాలు చేపిస్తాడనుకోలేదు. ఆర్మ్స్‌ప్రైమ్‌తో ఒప్పందం కుదరడంతో మొదట గ్లామర్ వీడియోలు చేశాం. ఆ తర్వాత బోల్డ్ సినిమాలు. గ్లామర్ వీడియోల్లో అశ్లీల చిత్రాలు కూడా భాగమేనని నమ్మించాడు. నగ్న చిత్రాలనేవి సర్వసాధారణమన్నట్లు చెప్పేవాడు. అంతేకాకుండా, నా వీడియోలు, ఫొటోలు శిల్పాకు బాగా నచ్చాయని అబద్ధాలు చెప్పాడు. ఆయన చెప్పిన మాటలు నమ్మి చివరికి మోసపోయాను. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ స్వార్థపరులే. డబ్బు కోసం ఎదుటివాళ్లను ఇబ్బందులపాలు చేస్తారు. భవిష్యత్తులో నా పిల్లల్ని ఈ పరిశ్రమలోకి పంపించను’’ అని షెర్లిన్ కన్నీటి పర్యంతమయ్యారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Andhra News: ఎమ్మెల్యే శ్రీదేవి ఫ్లెక్సీలను చించేసిన వైకాపా నాయకులు
-
Ts-top-news News
ఖగోళంలో వింత... చంద్రుడితో శుక్ర గ్రహణం
-
India News
Rahul Gandhi : రాహుల్‌పై వేటు నిలబడుతుందా..
-
Ap-top-news News
Vande Bharat Express : తిరుపతి-సికింద్రాబాద్ మార్గంలో వందేభారత్.. 8న ప్రారంభించే అవకాశం
-
Crime News
చిలుక వాంగ్మూలంతో.. హత్యకేసు నిందితులకు జీవితఖైదు
-
India News
వయనాడ్ సీటు ఖాళీ.. ప్రకటించిన లోక్‌సభ సచివాలయం