RamCharan: ఆ అభిమాని చేసిన పనికి భయపడ్డా: రామ్‌చరణ్‌

కేవలం తనని చూడటం కోసమే ఓ అభిమాని చేసిన సాహసం వల్ల తాను భయపడ్డానని నటుడు, మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ అన్నారు. ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న ఆయన తాజాగా మలయాళీ....

Published : 23 Mar 2022 14:00 IST

హైదరాబాద్‌: కేవలం తనని చూడటం కోసమే ఓ అభిమాని చేసిన సాహసం వల్ల తాను భయపడ్డానని నటుడు, మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ అన్నారు. ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న ఆయన తాజాగా మలయాళీ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. జక్కన్న, తారక్‌, చరణ్‌ పాల్గొన్న ఈ ఇంటర్వ్యూలో సినిమాకు సంబంధించిన విశేషాలతో పాటు ఆసక్తికరమైన అంశాలు బయటపెట్టారు. రాపిడ్‌ ఫైర్‌ రౌండ్‌లో రామ్‌చరణ్‌ మాట్లాడుతూ.. ఇటీవల ఓ అభిమాని చేసిన పని తనని ఎంతో బాధపెట్టిందని అన్నారు.

ఎలాంటి సూపర్‌ పవర్‌ మీకు ఉంటే బాగుంటుందని భావిస్తున్నారు?

రామ్‌చరణ్‌: ఇన్‌విజిబుల్‌

ఇంకా బాగా చేసి ఉంటే బాగుండేదనిపించిన చిత్రమేది?

రామ్‌చరణ్‌: వినయ విధేయ రామ

ఎక్కడా ఉపయోగపడని ఒక టాలెంట్ ఏదైనా మీలో ఉందా?

రామ్‌చరణ్‌: మర్చిపోవడం

ఒక అభిమాని చేసిన పనితో మీరు ఇబ్బందిపడిన సంఘటన ఏదైనా ఉందా?

రామ్‌చరణ్‌: ఇటీవల ఒక అభిమాని చేసిన పనితో బాధపడ్డా. గత కొన్నిరోజల నుంచి నేను శంకర్‌ సినిమా షూట్‌లో బిజీగా ఉన్నాను. ఇటీవల ఆ సినిమా షూట్‌ రాజమండ్రిలో జరిగింది. నన్ను కలవడం కోసం రోజూ ఒక వ్యక్తి షూటింగ్‌ స్పాట్‌కి వచ్చి అక్కడక్కడే తిరుగుతూ ఉండేవాడు. అతన్ని గమనించిన నా సిబ్బంది.. నాకు సమాచారం అందించారు. మేకప్‌తో ఉన్న సమయంలో బయటకు వెళ్లొద్దని శంకర్‌ చెప్పడంతో నేను అతన్ని కలవలేకపోయాను. సరిగ్గా పదో రోజు ఆ వ్యక్తి గుండెలపై ఓ పెద్ద టాటూ వేయించుకుని వచ్చాడు. ఆ విషయం తెలిసిన వెంటనే అతన్ని కలిశాను. ‘టాటూ ఎప్పుడు వేయించావు’ అని అడిగితే.. మిమ్మల్ని కలవడం కోసమే.. నిన్న వేయించాను అన్నాడు. ఆ మాట విన్నాక నాకెంతో బాధగా, భయంగా అనిపించింది. నటీనటుల పేర్లను అభిమానులు పచ్చబొట్టు వేయించుకోవడం సర్వసాధారణం. కానీ, నన్ను కలవడం కోసమే టాటూ వేయించుకోవడం చూసి కాస్త భయంగా అనిపించింది.

మీ లైఫ్‌కి ఒక బ్యాక్‌గ్రౌండ్‌ సాంగ్ ఉండాలంటే అది ఏదై ఉండాలనుకుంటారు?

రామ్‌చరణ్‌: కేజీఎఫ్‌ ‘ధీరా ధీరా’ సాంగ్‌

మీ ఫోన్‌లో ఎక్కువగా ప్లే అయ్యే పాట?

తారక్‌: ఆశాపాసం.. ‘కేరాఫ్‌ కంచరపాలెం’ 

ఏ సినిమాకి సీక్వెల్‌ ఉంటే బాగుంటుందని భావిస్తున్నారు?

తారక్‌: అదుర్స్‌

మీరు ఒక ఐలాండ్‌లో చిక్కుకుపోయారు. ఇండస్ట్రీలో ఉన్న ముగ్గురు వ్యక్తులను ఎంచుకుని వారినీ మీతోపాటు అక్కడ ఉంచాలనుకుంటే.. ఆ ముగ్గురు ఎవరు?

తారక్‌: చరణ్‌, రానా, అనిరుధ్‌

భవిష్యత్తులో మీరు ఏ దర్శకుడితో వర్క్‌ చేయాలని కోరుకుంటున్నారు?

తారక్‌: రాజమౌళి

ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు ఫస్ట్‌ కాల్‌ ఎవరికి చేస్తారు?

తారక్‌: ప్రణతీ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని