RamCharan: ఆ అభిమాని చేసిన పనికి భయపడ్డా: రామ్‌చరణ్
కేవలం తనని చూడటం కోసమే ఓ అభిమాని చేసిన సాహసం వల్ల తాను భయపడ్డానని నటుడు, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ అన్నారు. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న ఆయన తాజాగా మలయాళీ....
హైదరాబాద్: కేవలం తనని చూడటం కోసమే ఓ అభిమాని చేసిన సాహసం వల్ల తాను భయపడ్డానని నటుడు, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ అన్నారు. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న ఆయన తాజాగా మలయాళీ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. జక్కన్న, తారక్, చరణ్ పాల్గొన్న ఈ ఇంటర్వ్యూలో సినిమాకు సంబంధించిన విశేషాలతో పాటు ఆసక్తికరమైన అంశాలు బయటపెట్టారు. రాపిడ్ ఫైర్ రౌండ్లో రామ్‌చరణ్ మాట్లాడుతూ.. ఇటీవల ఓ అభిమాని చేసిన పని తనని ఎంతో బాధపెట్టిందని అన్నారు.
ఎలాంటి సూపర్ పవర్ మీకు ఉంటే బాగుంటుందని భావిస్తున్నారు?
రామ్‌చరణ్: ఇన్విజిబుల్
ఇంకా బాగా చేసి ఉంటే బాగుండేదనిపించిన చిత్రమేది?
రామ్‌చరణ్: వినయ విధేయ రామ
ఎక్కడా ఉపయోగపడని ఒక టాలెంట్ ఏదైనా మీలో ఉందా?
రామ్‌చరణ్: మర్చిపోవడం
ఒక అభిమాని చేసిన పనితో మీరు ఇబ్బందిపడిన సంఘటన ఏదైనా ఉందా?
రామ్‌చరణ్: ఇటీవల ఒక అభిమాని చేసిన పనితో బాధపడ్డా. గత కొన్నిరోజల నుంచి నేను శంకర్ సినిమా షూట్లో బిజీగా ఉన్నాను. ఇటీవల ఆ సినిమా షూట్ రాజమండ్రిలో జరిగింది. నన్ను కలవడం కోసం రోజూ ఒక వ్యక్తి షూటింగ్ స్పాట్‌కి వచ్చి అక్కడక్కడే తిరుగుతూ ఉండేవాడు. అతన్ని గమనించిన నా సిబ్బంది.. నాకు సమాచారం అందించారు. మేకప్‌తో ఉన్న సమయంలో బయటకు వెళ్లొద్దని శంకర్ చెప్పడంతో నేను అతన్ని కలవలేకపోయాను. సరిగ్గా పదో రోజు ఆ వ్యక్తి గుండెలపై ఓ పెద్ద టాటూ వేయించుకుని వచ్చాడు. ఆ విషయం తెలిసిన వెంటనే అతన్ని కలిశాను. ‘టాటూ ఎప్పుడు వేయించావు’ అని అడిగితే.. మిమ్మల్ని కలవడం కోసమే.. నిన్న వేయించాను అన్నాడు. ఆ మాట విన్నాక నాకెంతో బాధగా, భయంగా అనిపించింది. నటీనటుల పేర్లను అభిమానులు పచ్చబొట్టు వేయించుకోవడం సర్వసాధారణం. కానీ, నన్ను కలవడం కోసమే టాటూ వేయించుకోవడం చూసి కాస్త భయంగా అనిపించింది.
మీ లైఫ్‌కి ఒక బ్యాక్‌గ్రౌండ్ సాంగ్ ఉండాలంటే అది ఏదై ఉండాలనుకుంటారు?
రామ్‌చరణ్: కేజీఎఫ్ ‘ధీరా ధీరా’ సాంగ్
మీ ఫోన్లో ఎక్కువగా ప్లే అయ్యే పాట?
తారక్: ఆశాపాసం.. ‘కేరాఫ్ కంచరపాలెం’
ఏ సినిమాకి సీక్వెల్ ఉంటే బాగుంటుందని భావిస్తున్నారు?
తారక్: అదుర్స్
మీరు ఒక ఐలాండ్‌లో చిక్కుకుపోయారు. ఇండస్ట్రీలో ఉన్న ముగ్గురు వ్యక్తులను ఎంచుకుని వారినీ మీతోపాటు అక్కడ ఉంచాలనుకుంటే.. ఆ ముగ్గురు ఎవరు?
తారక్: చరణ్, రానా, అనిరుధ్
భవిష్యత్తులో మీరు ఏ దర్శకుడితో వర్క్ చేయాలని కోరుకుంటున్నారు?
తారక్: రాజమౌళి
ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు ఫస్ట్ కాల్ ఎవరికి చేస్తారు?
తారక్: ప్రణతీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప2’ తర్వాత అత్యధిక పారితోషికం తీసుకునే విలన్ మీరేనా? ఫహద్ సమాధానం ఇదే!
తన పారితోషికం గురించి నటుడు ఫహద్ ఫాజిల్ తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. -
పెళ్లి చేసుకో.. జీవితం బాగుంటుంది: వరలక్ష్మీ శరత్‌కుమార్ ఫన్నీ వీడియో
పెళ్లిపై నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ ఓ వీడియో క్రియేట్ చేశారు. దాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. -
పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన రణ్వీర్ సింగ్
రణ్వీర్ సింగ్ తన ఇన్‌స్టా నుంచి పెళ్లి ఫొటోలు తొలగించడం చర్చనీయాంశంగా మారింది. -
వి.వి. వినాయక్ వల్లే ‘ఆర్య’ సాధ్యమైంది: అల్లు అర్జున్
వి.వి వినాయక్ ఇచ్చిన ధైర్యం వల్లే ‘ఆర్య’ తీశామని అల్లు అర్జున్ అన్నారు. -
జాన్వీ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. రిప్లై ఇచ్చిన ‘దేవర’ భామ
జాన్వీ పెళ్లిపై నెటిజన్ పోస్ట్‌పెట్టారు. దానికి ఆమె రియాక్ట్ అయ్యారు. -
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న అప్డేట్స్ మీకోసం.. -
చేయాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి.. రూమర్స్‌పై స్పందించిన కంగనా
ఎన్నికల తర్వాత కూడా తాను ఇండస్ట్రీలోనే కొనసాగుతానని కంగనా స్పష్టం చేశారు. -
నా లెక్కల మాస్టర్‌కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్‌కి బుచ్చిబాబు లేఖ
తన గురువు సుకుమార్‌కి బుచ్చిబాబు సానా ప్రేమ లేఖ రాశారు. నెట్టింట అది అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. -
‘పుష్ప’ తర్వాత ఎలాంటి మార్పు రాలేదు: ఫహాద్ ఫాజిల్
‘పుష్ప’ తర్వాత తన కెరీర్లో ఎలాంటి మార్పు రాలేదని నటుడు ఫహాద్ ఫాజిల్ అన్నారు. -
‘యానిమల్’తో పోలుస్తూ ‘రానా నాయుడు’పై రానా కామెంట్..
‘యానిమల్’ విడుదలయ్యాక ‘రానా నాయుడు’ చాలామందికి మంచి సిరీస్‌లా కనిపించిందని రానా అన్నారు. -
సిద్ధార్థ్ వల్లే ప్రేమపై నమ్మకం పెరిగింది: అదితి రావ్
సిద్ధార్థ్‌తో తన రిలేషన్ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో అదితి ఓపెన్ అయ్యారు. -
నా జీవితాన్ని మార్చింది.. ‘ఆర్య’పై అల్లు అర్జున్ పోస్ట్
‘ఆర్య’ విడుదలై 20 ఏళ్లు పుర్తయిన సందర్భంగా అల్లుఅర్జున్ పోస్ట్ పెట్టారు. -
పవన్‌ను గెలిపించండి.. సేవకుడిగా అండగా ఉంటాడు: చిరంజీవి
తన కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ది అని ఆయన సోదరుడు, ప్రముఖ నటుడు చిరంజీవి అన్నారు. -
25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. ఇలా చేయడం బాధగా ఉంది: కరణ్ జోహార్
కమెడియన్ తనను అనుకరించడంపై కరణ్ జోహార్ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా బాధ పడ్డారు. -
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
దక్ష నగర్కర్కు ఏమైంది..?ఆందోళనలో అభిమానులు
తాను ఆస్పత్రిలో చేరినట్టు నటి దక్ష నగర్కర్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. -
ఆ రికార్డు సాధించిన తొలి భారతీయ పాట ‘కేసరియా’
‘బ్రహ్మాస్త్ర’లోని ‘కేసరియా’ పాట రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది. -
‘నువ్వు లేకపోయినా ఫర్వాలేదు’ అంటూ నెటిజన్ కామెంట్.. హీరో ఏమన్నారంటే?
‘నువ్వు లేకపోయినా ఫర్వాలేదు’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా సుశాంత్ ఏమన్నారంటే? -
సోనాక్షీతో ఇంటిమేట్ సీన్స్.. అందుకే సిగ్గుపడ్డాను: ‘హీరామండి’ నటుడు
‘హీరామండి’లో సోనాక్షీతో తన సన్నివేశాల గురించి నటుడు ఇంద్రేష్ మాలిక్ స్పందించారు. -
సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు
సమంత (Samantha) ఒక ఫొటో షేర్ చేసి డిలీట్ చేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
జపాన్‌లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్