PMModi: ‘భారత్‌ రండి.. కథలకు కొదవ లేదు’

ఘనమైన వారసత్వ సంపద, విభిన్నమైన సంస్కృతులకు నెలవైన భారత్‌లో కథలకు కొదవ లేదనీ, సినిమాలు తెరకెక్కించడానికి అనువైన వాతావరణం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దర్శక, నిర్మాతలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.

Updated : 18 May 2022 06:39 IST

నమైన వారసత్వ సంపద, విభిన్నమైన సంస్కృతులకు నెలవైన భారత్‌లో కథలకు కొదవ లేదనీ, సినిమాలు తెరకెక్కించడానికి అనువైన వాతావరణం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దర్శక, నిర్మాతలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ప్రస్తుతం ఫ్రాన్స్‌లో జరుగుతున్న కేన్స్‌ చిత్రోత్సవాల్లో ఇండియాకి ‘గౌరవ సభ్య దేశం’ హోదా దక్కడం పట్ల సంతోషం వ్యకం చేశారు. ఈ సందర్భంగా ఆయన తన సందేశాన్ని పంపించారు. ఇందులో భారతీయ సినిమా గొప్పతనం, చిత్రీకరణకు ఏ విధంగా అనుకూలమో వివరించారు. భారత్‌ ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలను నిర్మించే దేశమన్నారు. ఘనమైన సాంస్కృతిక వారసత్వ సంపద ఈ దేశ బలం అని వ్యాఖ్యానించారు. బయటి దేశాల నిర్మాతలకు సౌకర్యంగా ఉండేలా చిత్ర నిర్మాణ రంగంలోనూ సులభతర వాణిజ్య విధానాన్ని అవలంబిస్తున్నామని తెలిపారు. నైపుణ్యం ఉన్న మానవ వనరులు, వైవిధ్యమైన ప్రకృతి అందాలకు నెలవైన భారతదేశం దర్శక నిర్మాతలకు స్వర్గధామంగా ఉండగలదని విశ్వాసం వ్యక్తం చేశారు. కేన్స్‌ క్లాసిక్‌ చిత్ర ప్రదర్శనలో సత్యజిత్‌ రే సినిమాను ప్రదర్శించనుండడం ఆయన శతజయంతి ఉత్సవాలను జరుపుకొంటున్న తమకు అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందన్నారు. ఈ వేడుకలో పాల్గొంటున్న భారత చిత్ర బృందానికి కేంద్ర సమాచార,   ప్రసారశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకుర్‌ నేతృత్వం వహిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని