Samantha: ఇకపై ముంబయిలోనే సమంత..? జోరందుకున్న ప్రచారం
‘శాకుంతలం’ (Shaakuntalam) మరోసారి వాయిదా పడటంతో ప్రస్తుతానికి తన దృష్టి మొత్తాన్ని ‘సిటాడెల్’ (Citadel)పైనే పెట్టారు నటి సమంత (Samantha). ఈ సిరీస్ షూట్‌లో భాగంగా ఆమె కొన్ని రోజుల నుంచి ముంబయిలోనే ఉంటున్నారని టాక్.
ముంబయి: అనారోగ్యం కారణంగా కొన్ని నెలల పాటు రోల్.. కెమెరా.. యాక్షన్.. అనే పదాలకు దూరంగా ఉన్న సమంత (Samantha) ఇప్పుడిప్పుడే తిరిగి కెరీర్‌పై దృష్టి సారించిన విషయం తెలిసిందే. మయోసైటిస్ నుంచి కోలుకున్న ఆమె ప్రస్తుతం బాలీవుడ్ (Bollywood)లో తెరకెక్కుతోన్న ‘సిటాడెల్’ (Citadel) ఇండియన్ వెర్షన్ కోసం రంగంలోకి దిగారు. ఈ క్రమంలో సామ్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. సామ్ రానున్న రోజుల్లో బాలీవుడ్ ప్రాజెక్ట్‌లపైనే ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారని, అందుకు అనుగుణంగా ముంబయిలో ఓ ఇంటిని సైతం కొనుగోలు చేశారని తాజాగా బాలీవుడ్ మీడియా కోడైకూస్తోంది. మూడు పడక గదులు ఉన్న ఈ ఇంటి కోసం ఆమె రూ.15 కోట్లు చెల్లించారని సమాచారం. అయితే, ఈ వార్తలపై సామ్ నుంచి కానీ, ఆమె టీమ్ నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
మరోవైపు, సామ్ ముంబయికి మకాం మారుస్తున్నట్లు ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై గతంలో సామ్ స్పందిస్తూ.. హైదరాబాద్ తన ఇల్లు లాంటిదని అన్నారు. ఈ నగరంతో తనకు ప్రత్యేక అనుబంధం ఉన్నట్లు చెప్పారు. తాను ఎక్కడ ఉన్నా సరే దక్షిణాది ప్రాజెక్ట్‌లలో నటిస్తానని తెలిపారు. గతేడాది విడుదలైన ‘యశోద’ ప్రమోషన్స్‌లో తాను మయోసైటిస్‌తో బాధపడుతున్నట్లు ప్రకటించి సామ్ తన అభిమానులను షాక్‌కు గురి చేశారు. కొన్ని నెలల పాటు షూటింగ్స్ అన్నింటికీ దూరమయ్యారు. ఇటీవల దాని నుంచి కోలుకున్న ఆమె తిరిగి సెట్స్‌లోకి అడుగుపెడుతున్నారు. ఇందులో భాగంగా ‘సిటాడెల్’ షూట్ కోసం ఆమె ముంబయిలో ఉంటున్నారు. రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తోన్న ఈ సిరీస్‌లో వరుణ్‌ధావన్-సామ్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
క్యాన్సర్, అధిక రక్తపోటుకు అల్లోపతిలో చికిత్స లేదు: బాబా రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు
-
Politics News
కేజ్రీవాల్ విందు భేటీ విఫలం.. హాజరుకాని ముఖ్యమంత్రులు
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/03/23)
-
General News
Viral: ప్రొజెక్టర్ స్క్రీన్‌గా బెడ్‌షీట్.. ఇది కదా వాడకమంటే..!
-
Ts-top-news News
ఒకే పేరు... 38 బ్యాంకు ఖాతాలు!.. బాధితుడికి తెలియకుండానే ఆన్లైన్లో అకౌంట్లు
-
Sports News
ఆ సమాధానమే అర్థం కాలేదు.. వెస్టిండీస్ బ్యాటర్ డెండ్రా డాటిన్