Khiladi: రవితేజ ‘ఖిలాడి’ నుంచి మరో ఫుల్‌ వీడియో సాంగ్‌

రవితేజ హీరోగా రమేష్‌ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘ఖిలాడి’. మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయాతి కథానాయికలుగా నటించిన ఈ సినిమా ఇటీవల విడుదలై, ప్రేక్షకాదరణ పొందింది.

Published : 07 Mar 2022 01:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రవితేజ హీరోగా రమేష్‌ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘ఖిలాడి’. మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయాతి కథానాయికలు. ఇటీవల విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ సందర్భంగా ఇప్పటికే కొన్ని వీడియో పాటలు విడుదల చేసిన చిత్ర బృందం తాజాగా ‘ఇష్టం’ అనే వీడియో సాంగ్‌ను పంచుకుంది. తన కోసం కథానాయకుడు పడే కష్టం ‘చాలా ఇష్టమంటూ’ కథానాయిక పాడుకునే పాట ఇది. ఈ పాటలోని రవితేజ, డింపుల్‌ హయాతి క్యాచీ డ్యాన్స్‌ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. శ్రీమణి రాసిన ఈ గీతాన్ని హరిప్రియ ఆలపించారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలందించారు. ఈ వీడియోతోపాటు ‘ఫుల్‌ కిక్కు’, ‘అట్టా సూడకే’ పాటల వీడియోలూ చూసేయండి..




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని