Bholaa Shankar: భోళా జజ్జనక జామ్‌

చిరంజీవి కథానాయకుడిగా ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘భోళాశంకర్‌’. తమన్నా కథానాయిక. కీర్తిసురేశ్‌ ముఖ్యభూమిక పోషిస్తున్నారు.

Updated : 10 Jul 2023 14:04 IST

చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘భోళాశంకర్‌’ (Bholaa Shankar). తమన్నా కథానాయిక. కీర్తిసురేశ్‌ ముఖ్యభూమిక పోషిస్తున్నారు. మెహర్‌ రమేశ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సుంకర రామబ్రహ్మం నిర్మాత. చిత్రం ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ‘జామ్‌ జామ్‌ జజ్జనక...’ అంటూ సాగే ఈ చిత్రంలోని గీతాన్ని ఈ నెల 11న విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం తెలిపింది. ఈ పాటలో చిరంజీవి నృత్యాలు కనువిందు చేస్తాయని సినీ వర్గాలు తెలిపాయి. సుశాంత్‌, రఘుబాబు, మురళీశర్మ, రవిశంకర్‌, వెన్నెల కిశోర్‌, తులసి, సురేఖావాణి, శ్రీముఖి, హైపర్‌ ఆది, వైవా హర్ష తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: మహతి స్వరసాగర్‌, ఛాయాగ్రహణం: డడ్లీ.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని