నయన్ వర్సెస్ సామ్ రూమర్స్‌కు చెక్!
అగ్రకథానాయికలు నయనతార-సమంత కలిసి నటిస్తే చూడాలని ఆశగా ఎదురుచూస్తున్న అభిమానులకు సంతోషాన్ని అందిస్తూ ఈ ఏడాది ఆరంభంలో ‘కాతువక్కుల రెండు కాదల్’ అనే తమిళ సినిమా ప్రకటన తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. నయన్ ప్రియ సఖుడు...
షూటింగ్ షురూ
హైదరాబాద్: అగ్రకథానాయికలు నయనతార-సమంత కలిసి నటిస్తే చూడాలని ఆశగా ఎదురుచూస్తున్న అభిమానులకు సంతోషాన్ని అందిస్తూ ఈ ఏడాది ఆరంభంలో ‘కాతువక్కుల రెండు కాదల్’ అనే తమిళ సినిమా ప్రకటన తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో విజయ్‌సేతుపతి కథానాయకుడిగా నటించనున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్‌ని ప్రకటించిన కొన్నిరోజులకే సామ్.. దీని నుంచి తప్పుకున్నారని వార్తలు వచ్చాయి. సదరు వార్తలపై చిత్రబృందం అధికారికంగా స్పందించలేదు. ఇటీవల లాక్‌డౌన్ తర్వాత షూటింగ్స్ ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్న తరుణంలో సైతం.. సామ్, నయన్ కలిసి నటించడం లేదంటూ.. వ్యక్తిగత కారణాల వల్ల సమంత ప్రాజెక్ట్‌కు నో చెప్పిందని మరోసారి ఊహాగానాలు వినిపించాయి.
కాగా, తాజాగా ‘కాతువక్కుల రెండు కాదల్’ సినిమా షూటింగ్ గురువారం ప్రారంభమయ్యింది. పూజా కార్యక్రమానికి సంబంధించిన కొన్ని ఫొటోలను చిత్ర నిర్మాణ సంస్థ ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకుంది. ఆ పోస్ట్‌ను చిత్రంలో నటిస్తున్న నటీనటులను ట్యాగ్ చేసింది. అలా ట్యాగ్ చేసిన వాటిల్లో నయన్ పేరుతోపాటు సమంత పేరూ ఉంది. దీంతో సామ్,నయన్ సినిమాపై వస్తున్న వార్తలు పుకార్లే అని తేలింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
JK: ₹300 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్.. ఇద్దరి అరెస్టు
-
Narnia: గుజరాత్ సముద్ర తీరానా హుందాగా మృగరాజు.. అరుదైన ఫొటో వైరల్..!
-
Chahal: బాధ ఎందుకు ఉండదు.. కానీ 15 మందికే కదా అవకాశం: చాహల్
-
PM Modi: తెలంగాణకు పసుపు బోర్డు, గిరిజన వర్సిటీ: ప్రధాని మోదీ
-
Jaguar Land Rover: 2030 కల్లా 8 విద్యుత్ వాహనాలను తీసుకొస్తాం: జాగ్వార్ ల్యాండ్‌రోవర్
-
PM Modi: మహబూబ్‌నగర్ చేరుకున్న ప్రధాని మోదీ