Kamal Haasan: రాజకీయాల్లో కొనసాగాలంటే సినిమాలు వదిలేయాలా?: కమల్‌ హాసన్‌

విజయ్‌ రాజకీయ ప్రవేశంపై అగ్ర కథానాయకుడు కమల్‌ హాసన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Updated : 22 Feb 2024 12:07 IST

చెన్నై:  నటుడు విజయ్‌ (Vijay) ‘తమిళ వట్రి కళగం’ పేరుతో కొత్త రాజకీయ పార్టీ నెలకొల్పిన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటానని విజయ్‌ ఇటీవల ప్రకటించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కమల్‌ హాసన్‌ని (Kamal Haasan) ఈ అంశంపై ప్రశ్నించగా ఆయన ఇలా స్పందించారు. 

‘‘ విజయ్‌కు శుభాకాంక్షలు. అతను రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు ప్రోత్సహించిన వారిలో నేనూ ఉన్నాను. వీటి గురించి మేము చర్చించుకున్నాం.  ఒకదానిలో కొనసాగాలంటే మరో రంగాన్ని విడిపెట్టాలని లేదు. రాజకీయాలా? సినిమాలా? అన్నది విజయ్‌ వ్యక్తిగత అభిప్రాయం. ఆయన చేసే సినిమాలు విభిన్నంగా ఉంటాయి. నన్ను అలా చేయమంటే ఎలా? అద్భుతంగా పాటలు రాసే ఓ రచయితలా మీరు పాట రాయండి అంటే అది సాధ్యం కాదు. ఎవరి సామర్థ్యం వారిది. రాజకీయాల్లో ఉంటూనే సినిమాలు చేస్తాను ’’అని కమల్‌ హాసన్ వెల్లడించారు. 

కమల్‌ హాసన్‌ ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో ‘థగ్‌ లైఫ్‌’అనే చిత్రం నటిస్తున్నారు. మరోవైపు విజయ్‌ వెంకట్‌ ప్రభు తెరకెక్కిస్తున్న ‘ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌’ మూవీ చేస్తున్నారు. సైన్స్ ఫిక్షన్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో విజయ్‌ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని